ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ టెలికం సంస్థకైనా 5జీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని భారతీదేశ ఐటీ దిగ్గజం టీసీఎస్ హెడ్ కమల్ భదాడా తెలిపారు.ఇక ఇప్పటికే పలు దేశాల్లోని టెల్కోలకు టెక్నాలజీ ఇవ్వడంతో పాటుగా ఇంకా వాటి నెట్‌వర్క్‌లను నిర్వహించే సర్వీసులు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు.దేశీ అవసరాలకు తగ్గట్లు నెట్‌వర్క్‌పై మరింతగా కసరత్తు చేస్తున్నామని కమల్ వివరించడం జరిగింది. ప్రస్తుతం చాలా దేశాల్లో 5జీ నెట్‌వర్క్ వినియోగం అనేది ఇంకా మధ్యలోనే ఉండగా.. భారత దేశంలో ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని అన్నారు. 2023 వ సంవత్సరం లేదా 2024 వ సంవత్సరం నాటికి 5జీ సేవలు అందుబాటులోకి రావచ్చని..ఇక ఆ తర్వాత పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు మరో 3 నుంచి 4 ఏళ్లు సమయం పడుతుందని కమల్ తెలిపారు.
అటు పైన 6జీ నెట్‌వర్క్ కోసం ప్రక్రియ స్టార్ట్ కాగలదని కూడా ఆయన వివరించారు.ఇక అలాగే 6జీ మొబైల్ టెక్నాలజీ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ స్పీడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ఇక చైనా రీసెర్చర్లు సెకన్ వ్యవధిలో 206.25 డేటాను షేర్ చేసే కెపాసిటీ 6జీ టెక్నాలజీని బిల్డ్ చేసినట్లు చైనా మీడియా తన కథనంలో పేర్కొనడం జరిగింది. ఇక అంతేకాదు 6జీ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వస్తే 5జీ నెట్ వర్క్ కంటే 100రెట్లు ఫాస్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించడం జరిగింది.ఇక ఉదాహరణకు 4కే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మొత్తం 59.5గంటలు టైమ్ ఉండగా..ఆ మొత్తాన్ని కూడా చిటికెలో డౌన్‌లోడ్ చేయొచ్చు. అంటే 206.25గిగా బైట్ల వేగంతో ఆ అన్నిగంటల సినిమాను కేవలం 16 సెకన్లలోనే ఫాస్ట్ గా డౌన్‌లోడ్ చేయొచ్చన్నమాట. కాగా, సౌత్ కొరియా మీడియా కథనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..టెలికాం కంపెనీల నుంచి సేకరించిన సమాచారం మేరకు 6జీ టెక్నాలజీ 2030 వ సంవత్సరం నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తోంది.