బుల్లి పిట్ట: 60% డిస్కౌంట్ తో అమెజాన్ హోలీ సేల్..!!

Divya
ఈ - కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రతి పండుగకు సరి కొత్త ఆఫర్లను తీసుకొస్తున్నట్లు గానే ఈసారి కూడా హోలీ పండుగకు ఏకంగా 60 శాతం డిస్కౌంట్ తో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పై భారీ ఆఫర్లు ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం హోలీ షాపింగ్ స్టోర్ సేల్ ను ప్రారంభించింది. స్పీకర్లు , హెడ్ ఫోన్లు, కెమెరాలు, వాచ్ లు,  వాటర్ప్రూఫ్ గాడ్జెట్ల పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించడం జరిగింది. ఇకపోతే జేబీఎల్, బోట్, నాయిస్, గోప్రో, ఇన్స్టా 360 వంటి టాప్ బ్రాండ్లకు చెందిన గాడ్జెట్లు పై ఏకంగా 60 శాతం డిస్కౌంట్ అని ప్రకటించి కస్టమర్లకు ఊరట కలిగించింది అమెజాన్.
అంతేకాకుండా హెచ్డీఎఫ్సి కార్డ్ లపై అతి తక్కువ ధరలకు ఈఎంఐ ఆప్షన్ ని కూడా మనం పొందవచ్చు. ఈ సేల్ కొన్ని రోజుల పాటు మాత్రమే మనకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మనకు అమెజాన్ ద్వారా అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం.
గోప్రో హీరో10:
అమెజాన్ హోలీ షాపింగ్ స్టోర్ సేల్ లో గోప్రో హీరో10 కెమెరాను మనం ఏకంగా ఆఫర్ కింద రూ. 50 వేలకి కొనుగోలు చేయవచ్చు. ఇక ఇది అద్భుతమైన పనితీరు కోసం క్వాలిటీ ఫొటోస్ కోసం ఫ్రేమ్ రేట్ ను కూడా అందించింది. ఇక తక్కువ వెలుతురులో కూడా చక్కటి ఫోటోలను మీరు తీయవచ్చు.
ఇన్ స్టా 360 1R ట్విన్ ఎడిషన్:
డ్యుయల్ 360 మోడ్ తో ఇన్ స్టా 360 1R ట్విన్ ఎడిషన్ కెమెరా సహాయంతో సూపర్ షాట్ తో 5.7 K  రిజల్యూషన్ గల చిత్రాలను , వీడియోలను మీరు షూట్ చేయవచ్చు. అమెజాన్ లో దీని ధర రూ.40,499 వద్ద మనకు లభిస్తుంది. కెమెరా A1 ఆధారిత అల్గారిథం తో పని చేస్తుంది. ఇక వీటితో పాటు మరెన్నో గాడ్జెట్స్ మీరు ఏకంగా 60 శాతం డిస్కౌంట్ తో పొందే అవకాశం కల్పించబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: