రాత్రిళ్ళు ఇలా చేస్తే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువట..!!

Divya
సాధారణంగా కొంత మంది కొన్ని పదార్థాలను తినడం వల్ల మధుమేహం వచ్చే సమస్య ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఇష్టం వచ్చినట్లు ఆహారం తీసుకుంటే అది డయాబెటిస్ కు దారి తీస్తుందట. కాబట్టి కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. మధుమేహం ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే అధిక బరువు.. శారీరక శ్రమ లేని వారు.. గంటల తరబడి కూర్చునే వారు.. పోషక ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోని వారు, అధికంగా కొవ్వు ఉండే పదార్థాలు.. వేపుడు కూరలు.. మాంసాహారం.. బేకరీ ఐటమ్స్.. నిల్వ ఉండే పచ్చళ్ళు, తీపి పదార్ధాలు వంటి వాటి వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు మద్యపానం, ధూమపానం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం లేకపోలేదని కొంతమంది వైద్యులు తెలియజేస్తున్నారు.

అంతే కాదు కొన్ని రకాల మందుల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా  స్టెరాయిడ్స్ , కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ , వైరస్,  హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మరికొంత మంది పని ఎక్కువయ్యేకొద్దీ ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు.. ఇక నిద్రపోయేముందు ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటారు.. ఎందుకంటే ఆ తర్వాత చేయాల్సిన పనులు చాలా తక్కువగా ఉండటం వల్ల నిద్ర హాయిగా పట్టడానికి కూడా కడుపునిండా తింటారు. ఇకపోతే రాత్రిళ్ళు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని వైద్యులు తెలియజేస్తున్నారు.


ఆహార నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే పడుకునే ముందు ఏ ఆహారం తింటే డయాబెటిస్ వస్తుందో వారు మనకి తెలియజేయడం జరిగింది.. నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి .. బ్రోకలీ , క్యాలీఫ్లవర్ , క్యాబేజీ వంటి కూరగాయలు ఆరోగ్యానికి మంచిదే అయినా రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉండాలి. ఇక అన్నం తిన్న వెంటనే తీపి పదార్థాలను అస్సలు తినకూడదు. అధికంగా చక్కెర వుండే పదార్థాలకు కూడా దూరంగా పెట్టాలి. అలాగే ఐస్ క్రీమ్ కూడా తినకూడదు. ఇలాంటి వాటివల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: