బుల్లిపిట్ట: మనం ఉపయోగించే మొబైల్స్ ఎంతకాలం ఉపయోగించుకోవచ్చు..?

Divya
ప్రస్తుతం మనకు మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా ఇంత కాలం అని ఉంటుంది.. అయితే ఆ జీవిత కాలం ముగిసిన తరువాత ఇక మీదట ఆ వస్తువు ఉపయోగించుకోవడానికి వీలు కాదు. అయితే ఈ స్మార్ట్ మొబైల్స్ కూడా ఈ రూల్స్ వర్తిస్తాయట. మనం వాడుతున్న ప్రతి స్మార్ట్ మొబైల్ కూడా ఒక నిర్ణీత జీవితకాలాన్ని కలిగి ఉంటుందట. కానీ మనం వాటిని గుర్తించలేక పోతూ ఉంటాము. ఎక్కువమంది మొబైల్ ని 2 లేదా 3 సంవత్సరాలు వాడుతూ మారుస్తూ ఉంటారు. వాస్తవానికి అయితే మన మొబైల్ ని ప్రతి ఆరు మాసాలకు ఒకసారి మారుస్తునే ఉండాలట. కానీ కంపెనీ వారు ఆ మొబైల్ కు ప్రతిసారి అప్డేట్ అందించడంతో ఆ మొబైల్ అప్డేట్ అవుతూ ఉంటుంది. అందుచేతనే ఏ మొబైల్ కూడ అప్డేట్ చేయకుండా ఉండకూడదు.

మన మొబైల్ కి ఏ కంపెనీలు ఏ విధంగా అప్డేట్ పంపిస్తా ఒకసారి చూద్దాం.

1). సాంసంగ్:
ఇండియాలో అతిపెద్ద మార్కెట్ కలిగిన బ్రాండ్లలో ఇది కూడా ఒకటి.. ఈ మొబైల్ ఐదేళ్ల వరకు అప్డేట్ ఇస్తూ ఉంటుంది.

2). వన్ ప్లస్ మరియు ఒప్పో:
భారతదేశంలో స్మార్ట్ మొబైల్ లో ఎక్కువగా ఉపయోగించే మొబైల్ లో ఇవి కూడా ఒకటి. ఈ మొబైల్స్ ఆండ్రాయిడ్ అప్డేట్ ను నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే ఇస్తుంది. ఈ తరహాలోనే ఒప్పో కూడా అప్డేట్ ఇస్తూ ఉంటుంది.

3). నోకియా:
ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్  కలిగిన మొబైల్ లో నోకియా కూడా ఒకటి. నోకియా మొబైల్ లో వచ్చిన G సిరీస్ మొబైల్ కు రెండు సంవత్సరాలు మాత్రమే అప్డేట్ ఇస్తుందట.

4). షియామి:
భారతదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న బ్రాండ్ గల మొబైల్ లో షియామి కూడ ఒకటీ. ఇది మూడేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్ అందిస్తుంది.

5). రియల్ మీ:
ఈ మొబైల్ రెండు సంవత్సరాలపాటు అప్డేట్ ఇస్తుంది.

ఇక వీటితో పాటే మోటరోలా, మైక్రోమాక్స్, ఇతర మార్కెట్లో లభించే మొబైల్స్ కూడా రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ అభ్యర్థిని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: