ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి.. మే నెలలో ఉక్కపోత లో చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అందుచేతనే ప్రజలందరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఎయిర్ కండిషన్స్ కానీ, కూలర్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. AC ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ ఎక్కువగా వాటిని ఉపయోగించుకోలేరు.. అందుచేతనే ఎక్కువశాతం కూలర్ వైపు నే ఎక్కువ మక్కువ చూపుతుంటారు. ప్రస్తుతం ఉన్న
టెక్నాలజీ ప్రకారం మన దేశంలో ఎన్నో కూలర్లు అందుబాటులో ఉన్నవి.
అయితే తాజాగా సింఫనీ సంస్ధ వారు తీసుకువచ్చిన ఈ కూలర్ మాత్రం చాలా స్పెషల్ గా ఉన్నదని చెప్పవచ్చు. ఈ కూలర్ ఇంట్లో పెట్టుకుంటే చాలు ఏసీ లాగ అనిపిస్తుందట. కానీ దీని ధర కూడా సాధారణ కూలర్ కొనుగోలు ధర లాగే ఉంటుందట. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.
అమెజాన్ లో (SYMPHONY CLOUD PERSONAL COOLER )ఈ కూలర్ ను రూ.13,699 రూపాయలకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ కూలర్ అసలు ధర 14,999 రూపాయలు కాగా..9% డిస్కౌంట్ తో దీని ధరను తగ్గించి అందుబాటులో ఉంచింది. ఇక అంతే కాకుండా వీటిపై పలు
బ్యాంక్ ఆఫర్లను కూడా ఉన్నాయట. ఇక అంతే కాకుండా నెలవారి EMI ఆప్షన్ ను కూడా ఉంచుతోంది. అందుకుగాను రూ.645 రూపాయలు నెల నెల చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక ఏడాది వరకు వారెంట్ ను కూడా అందిస్తుంది.
ఈ కంపెనీకి చెందిన కూలర్ కెపాసిటీ 15 లీటర్లు ఉంటుంది. ఇక
అమెజాన్ తో పాటుగా, ఆఫ్ లైన్ మార్కెట్లో కూడా ఈ కూలర్ అందుబాటులో ఉంటుంది అని తెలియజేశారు. సుమారుగా ఈ కూలర్ 2,000 చదరపు అడుగుల వరకు చల్లదనాన్ని ఇస్తుందని కంపెనీ వారు తెలియజేశారు. ఇక ఇది గదిలో ఉండే తేమ త్వరగా తగ్గిపోయేందుకు ఒక సిస్టమ్ ను కూడా అమర్చినట్లు ఈ సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. ఇక ఇందులో చాలా రకాల ఫీచర్లు ఉన్నట్లు తెలుపుతోంది సింఫనీ సంస్థ.