నది దాటడానికి రైతు సూపర్ ఐడియా.. చూస్తే అవాక్కే?
ఇక వంతెన వేసుకున్న భారీ వర్షాలకు వంతెన కూడా మునిగిపోతుంది. ఈ నేపథ్యంలో రైతు చేసిన ఆలోచన గ్రామస్తులందరూ ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసింది. కేరళలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి నాక అనే ఒక చిన్న గ్రామంలో వరద అనే నదిని దాటేందుకు రైతు వినూత్న ఆలోచన చేశాడు.. అతని పేరు కృష్ణ బట్. అయితే నది అవతల వైపు ఇతనికి పొలం ఉంది. ఇక తరచూ నది దాటడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాడు. కొత్త ఆలోచన చేశాడు. నది దాటే సమస్యకు పరిష్కారం కావాలి అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే రోప్ వే అయితే బెటర్ అని ఆలోచన చేశాడు.
ఈ క్రమంలోనే సునీల్ అనే ఒక ప్రొఫెసర్ సాయంతో వరద నదికి అడ్డంగా ఒక పెద్ద బాస్కెట్ తో రోప్‌వే ను నిర్మించాడు. ఇక ఆ బాస్కెట్ లో కూర్చొని రోప్ వే సహాయంతో నదిని ఎంతో సులభంగా దాటవేయవచ్చు. ఇక దీని కోసం కృష్ణ బట్ 60 వేల రూపాయలు ఖర్చు పెట్టాడు.. ఇక అంతలోనే అతనికి గ్రామస్థుల నుంచి కూడా సహకారం అందింది. ఇక ఇప్పుడు మహేష్ భట్ కి వచ్చిన చిన్నపాటి ఆలోచన గ్రామస్తులందరి కష్టాన్ని తీర్చింది దీంతో అతని తెలివికి అందరూ హాట్సాఫ్ చెప్పేస్తున్నారు..