బుల్లిపిట్ట: త్వరలో మరొక వాట్సప్ ఇన్ యాప్.. ఫీచర్స్ ఎలా ఉంటాయంటే..?
అందుకే వాట్సప్ కూడా తన యూజర్లను చేజారిపోకుండా చేసుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది.. ఇప్పుడు కూడా యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. సరి కొత్త ఫీచర్లను పరిచయం చేసింది.. ఇక అదేమిటంటే వాట్సాప్ ఐఓఎస్ యూజర్ల కోసం ఇన్ బిల్ట్ కెమెరా రీ డిజైన్డ్ క్యాప్షన్ వ్యూ తో సహా కొత్త కొత్త ఫీచర్లు పై పని చేయడం ప్రారంభించింది.. ఇప్పుడు బీటా వెర్షన్ లో కూడా యాప్ ఇన్ బిల్ట్ కెమెరా ఫీచర్ ను కూడా పరీక్షించడం జరుగుతుంది. ఇక త్వరలోనే ఆప్ ఇన్ బిల్ట్ కెమెరా ఫీచర్ను పునరుద్ధరించనుంది అని 9 టు 5 మాక్ నివేదికను స్పష్టం చేసింది.. అంతేకాదు వీటితోపాటు ఐఓఎస్ యూజర్ల కోసం బీటా వెర్షన్ 22.4.0.72 లో ఇన్బిల్ట్ కెమెరా మార్పులను త్వరలోనే ప్రవేశపెట్టనుంది.
అయితే ఈ మార్పులు వల్ల యూజర్లు వాట్సాప్ లో తీసే ఫోటోలను మరింత భద్రత చేకూరనున్నట్లు సమాచారం.. ఇక ప్రస్తుతం ఈ యాప్ బీటా టెస్టర్ లకు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే..ఇక త్వరలోనే ఐ ఓ ఎస్, ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం..