బుల్లిపిట్ట : జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. అధిక డేటా ప్లాన్స్..!!

Divya
ప్రైవేట్ టెలికాం దిగ్గజం సంస్థలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న రిలయన్స్ జియో గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న నెట్వర్క్ ఏమిటంటే జియో అని వెంటనే చెప్పేస్తారు ఎవరైనా సరే.. ఇక తన కస్టమర్లను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు వినూత్న మైన ఆఫర్లను ప్రవేశపెడుతూ కస్టమర్లకు మరింత చేరువ అవుతోంది. అందుకే చాలామంది ఇతర నెట్వర్క్లను ఉపయోగిస్తున్నప్పటికీ తప్పకుండా వారి రెండవ సిమ్ ఆప్షన్ జియో సిమ్ కార్డు తప్పనిసరి అయిపోయింది. అంతలా జియోకి కస్టమర్లు అలవాటుపడిపోయారు. ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇంటర్నెట్ డేటా అవసరం అవుతుంది కాబట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ డేటా జియో అందిస్తోంది అందుకే జియో కి షిఫ్ట్ అవుతున్నారు.

ఇక ఈ క్రమంలోనే కస్టమర్లను మరింత ఆకర్షించడానికి 84 రోజులు వ్యాలిడిటీ తో పాటు ఎక్కువ డేటాను అందించే విధంగా సరికొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇక ఆ వివరాల విషయానికి వస్తే రూ.1,199.. ఈ ప్లాన్ ద్వారా 84 రోజుల పాటు వ్యాలిడిటీ పొందడంతో పాటు ప్రతిరోజూ 3జీబి హైస్పీడ్ ఇంటర్నెట్ ను పొందవచ్చు. దీంతో మొత్తం 84 రోజులకు గాను 252 జీబీ ఇంటర్నెట్ డేటాను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.. ఈ ప్లాన్ తో ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందడమే కాకుండా జియో యాప్ లను కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించబడింది.

రూ.719 ప్లాన్ తో 84  రోజుల పాటు వ్యాలిడిటీ ని పొందవచ్చు ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారుడికి ప్రతిరోజు 2జీబి హై స్పీడ్ డేటా లభిస్తుంది . మొత్తంగా ఎనభై నాలుగు రోజులకు చూసుకుంటే 128gb లభించడమే కాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. ప్రతిరోజు ఉచితంగా 100 ఎస్ఎంఎస్ లు కూడా లభిస్తాయి.
రూ.666 ప్లాన్ తో 84 రోజులు వ్యాలిడిటీ, ప్రతిరోజూ  1.5 జీబీ డేటా లభిస్తుంది. టోటల్ గా  126gb ని మనం 84 రోజులపాటు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: