నాసా :గ్రహాంతర వాసులు ఐదువేల గ్రహాల్లో ఉన్నారట..!

frame నాసా :గ్రహాంతర వాసులు ఐదువేల గ్రహాల్లో ఉన్నారట..!

MOHAN BABU
అనంత విశ్వంలోని భూమిలాంటి ఐదువేల గ్రహాల్లో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మనిషిని పోలిన బుద్ధిజీవులు  ఉన్నారని ఖచ్చితంగా చెబుతున్నారు. టిఎస్ఎస్ సాటిలైట్ విడుదల చేసిన సమాచారం ఆధారంగా ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రతినిధులు. అంతరిక్ష పరిశోధనలో బాహ్య గ్రహాలను వెతికేందుకు తాము పరీక్షించిన ట్రాన్స్ టింగ్ ఎక్సో ప్లానెట్ సర్వీస్ సాటిలైట్ టెస్ ద్వారా ఈ విషయం వెల్లడైందంట్టు నాసా పేర్కొంది. సౌర కుటుంబంలో ఇతర గ్రహాలు అన్వేషణ వాటిపై గ్రహాంతరవాసుల ఆనవాళ్లను కనిపెట్టేందుకు ఏప్రిల్ 2018 నాసా టీఎస్ఎస్ సాటిలైట్ ను ప్రయోగించింది.

ఆనాటి నుంచి 5000 ల గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను గుర్తించిన ఈ ఉపగ్రహం వాటిలో 176 వస్తువులను గ్రహాలుగా నిర్ధారించింది. ఒక్క 2021 ఏడాదిలోనే 2400 ల గ్రహాలను పోలిన ఖగోళ వస్తువులను ఈ టెస్ గుర్తించిందని మసాచో సెర్చ్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకురాలు మిర్చల్ కొనిమోటో తెలిపారు. టెస్ గుర్తించిన ఐదువేల బాహ్య గ్రహాల్లో ఏలియన్స్ జాడలు ఉండే ఉంటాయని అమెరికాలోని అంతరిక్ష పరిశోధకులు వాదిస్తున్నారు. ఆయా గ్రహాలు ఏర్పడిన తీరు, ప్రస్తుతం ఉన్న తీరు,వాటిపై ఉన్న వాతావరణాలను అంచనా వేసి ఈ నిర్ణయానికి వచ్చారు. టెస్ ఉపగ్రహం ఖగోళ వస్తువును కనిపెట్టి దాన్ని గ్రహంగా గుర్తించేందుకు కొంత సమయం పడుతుండటంతో ఆయా వస్తువుల వాతావరణాన్ని అంచనా వేసేందుకు ఆలస్యమవుతుంది. ఇక టెస్  కంటే ముందు బాహ్య గ్రహాల పరిశోధనకు ప్రయోగించిన కెప్ల టెలిస్కోప్ రెండువేల ఖగోళ వస్తువులను కనుగొన్నా అవేవి గ్రహాలుగా నిర్ధారించబడలేదు. టెస్ కనిపెట్టిన ఒక గ్రహం పై ఏడాది కాలం, మన భూమిపై 16 గంటలకేముగుస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశోధకురాలు మిర్చల్ కొనిమోటో తెలిపారు. టెస్ పనితీరుపై అంతరిక్ష పరిశోధకులకు నమ్మకం కుదిరింది.

అందుకే రెండు సంవత్సరాల పని నిమిత్తం అంతరిక్షంలోకి పంపిన టెస్  సాటిలైట్స్ సేవలు మరో మూడేళ్ల పాటు అంటే 2025 వరకు వినియోగించుకోవాలని నాసా పరిశోధకులు  భావిస్తున్నారు.ఇప్పటివరకు కనిపెట్టిన గ్రహాలలో ఏలియన్స్ ఉండే అవకాశం ఉందని మాత్రమే అంచనా వేశామని, కాని నిర్ధారణ చేయలేదని మిర్చల్ కొనిమోటో తెలిపారు. ఏదేమైనా ఈ అనంత విశ్వంలో మనిషి ఒక్కడే బుద్దిజీవి కాదు. మనలాంటి బుద్ధిజీవులు ఏదో ఒక గ్రహం లో ఉండే ఉంటారని, అది త్వరలోనే నిజమవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు నాసా ఖగోళ శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: