బుల్లిపిట్ట:336 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ ..రూ.899లకే:జియో..!!

Divya
రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్లను తీసుకొస్తూ ఉంటుంది.. ఇప్పుడు తాజాగా 899 రూపాయలకే.. ఎక్కువ రోజులు వ్యాలిడిటీ వచ్చే విధంగా ఒక ప్లాన్లు తీసుకువచ్చింది. ఇక ఈ ప్లాన్ 336 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.ఇక ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, డేటాతో సహా మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ లు మాత్రం కేవలం జియో మొబైల్ ఉపయోగిస్తున్న వారికి మాత్రమే.. ఈ ప్లాన్ మీరు యాక్టివేషన్ చేసుకోవాలంటే..JIO-ALL IN-ONE అనే ప్లాన్ ను ఎంచుకోవాలి.
899 రూపాయలతో ప్లాన్ వేయించుకున్నట్లయితే 336 రోజుల వ్యాలిడిటీతో ఇది పూర్తిగా లభిస్తుంది. ఇక అంతే కాకుండా అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది.. అంటే ఇది నెలలో కేవలం 28 రోజులు మాత్రమే వర్తిస్తుంది..అంటే 12 నెలలకు చొప్పున ..336  రోజులకు మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది.అయితే.28 రోజులకు 2 జిపి హై స్పీడ్ డేటా అందిస్తుంది.. ఇక అంతే కాకుండా నెలకు 50 SMS లు చేసుకొని సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. అంతేకాకుండా జియో యాప్స్ ను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక జియో కస్టమర్లకు ఇది సరికొత్త లాంగ్ వ్యాలిడిటి ప్లాన్ అని చెప్పవచ్చు..
ఇక మరొక ప్లాన్ రూ.2,999 అందిస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.. మొత్తంగా 365 రోజుల వేలితో మనకి లభిస్తుంది. ప్రతిరోజు 2.5 GB హై స్పీడ్ డేటా ని ఈ ప్లాన్ తో వినియోగించుకోవచ్చు.. అంటే మొత్తం మీద 912.5GB హై స్పీడ్ డేటా మనకి లభిస్తుంది అనమాట. అంతే కాకుండా ప్రతి రోజు కి 100 ఎస్ఎంఎస్ లను కూడా పంపించుకోవచ్చు. అంతేకాకుండా జియో లో మొత్తం అన్ని ఆప్స్ ను ఉచితంగా మనం చూడవచ్చు.. వీటితోపాటు మరికొన్ని యాప్స్ ను కూడా తక్కువ ధరకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: