భూమిని సమీపిస్తున్న భారీ గ్రహశకలం.. ప్రమాదమా?

ఇక భూమికి సమీపంలో 7482 (1994 PC1) అనే పెద్ద గ్రహశకలం భూమి వైపు వస్తుంది. దీని దూరం భూమి ఇంకా చంద్రుని మధ్య దూరం కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ. nasa ఆస్టరాయిడ్ వాచ్ జనవరి 12న గ్రహశకలాన్ని ట్రాక్ చేయడానికి సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టడం జరిగింది.ఇక ఆ పోస్ట్ కి 3000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.ఇంకా అలాగే 1000 కంటే ఎక్కువ సార్లు ఆ పోస్ట్ షేర్ చేయబడింది. nasa వెబ్‌సైట్ ద్వారా గ్రహశకలం ఏంటో ఎంత పెద్దగా ఉంటుందో తెలుసుకోడానికి చాలా మంది ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు ఇంకా దాని వల్ల ప్రమాదం ఉంటుందేమో అని భయపడుతున్నారు. ఇక ఈ భారీ గ్రహశకలాన్ని ఎలా ట్రాక్ చేయాలో కూడా నాసా వెల్లడించింది. Earthsky.org ప్రకారం, 7482 (1994 PC1) యొక్క కాంతి శుక్ర గ్రహాలు ఇంకా ఆకాశంలో అన్‌ఎయిడెడ్ ఐతో కనిపించే ఇతర నక్షత్రాల ప్రకాశం కంటే తక్కువగా ఉంటుంది. వెబ్‌సైట్ ప్రకారం తెలిసిన విషయం ఏంటంటే..6-అంగుళాల లేదా పెద్ద హోమ్ టెలిస్కోప్ ఈ ఆస్టరాయిడ్‌ను గుర్తించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

అయితే క్లౌడ్ కవర్ లేదా కాలుష్యం ఉండకూడదు.ఈ గ్రహశకలం భూమికి ఎటువంటి ముప్పు కలిగించదని nasa పేర్కొన్నప్పటికీ, ఇది తాజా జెన్నిఫర్ లారెన్స్ ఇంకా లియోనార్డో డికాప్రియో చిత్రం 'డోంట్ లుక్ అప్' సినిమా లాగా ఉందని ప్రజలు అనుకుంటూ వున్నారు.నాసా గత సంవత్సరం ఒక గ్రహశకలాన్ని దారి మళ్లించడానికి మొదటి ప్రయత్నం చేసింది. సెప్టెంబరు 26 ఇంకా అక్టోబరు 1 మధ్య, డైమోర్ఫోస్ అనే చిన్న చంద్రుడు DARTని తాకడం జరిగింది. మూన్‌లెట్ కొద్దిగా టచ్ అవ్వడం ద్వారా మార్చబడుతుందని అంచనా వేయబడింది. nasa ప్రకారం, రాబోయే 100 సంవత్సరాలలో భూమిని ఢీకొనే ప్రమాదాన్ని సూచించే గ్రహశకలం ఇప్పట్లో లేదని తెలిపింది.కాబట్టి దీని వల్ల ఎటువంటి ప్రమాదం అనేది లేదు.ఇక ఇది మనల్ని సురక్షితంగా దాటిపోతుంది.ఇది 19 లక్షల కిలోమీటర్ల దూరంలో సురక్షితంగా ఇంకా చాలా జాగ్రత్తగా భూమిని దాటుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: