యాంటీ 5జీ.. ఆరోగ్యానికి ఇంత ప్రమాదకరమా..!

MOHAN BABU
ఎన్నో ఏళ్ల వాగ్దానాలు, నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు ఐదవ తరం(5G) వైర్ లెస్ సెల్యులార్ టెక్నాలజీ వినియోగదారులకు చేరువ కానుంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో 5g సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఒక అంచనా ప్రకారం.. దీని వేగం 4G కంటే పది రేట్లు ఎక్కువ అని తెలుస్తోంది. అంతేకాదు 5గా సర్వీస్ ను డిజిటల్ విప్లవానికి నాందిగా అభివర్ణిస్తున్నారు టెక్ నిపుణులు. అయితే దీని వల్ల ఎన్ని లాభాలున్నప్పటికీ అంతకుమించిన విమర్శలు లేకపోలేదు.

 5జీ సాంకేతికత వల్ల వెలువడే ఫ్రీక్వెన్సీ నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఇప్పటికే ఎంతో మంది యాంటీ 5జీ జ్యువెలరీ ధరిస్తున్నారు. ఎందుకంటే ఆ తరంగాల లోని ప్రమాదకర రేడియోధార్మికత వల్ల ముప్పు పొంచి ఉందని తాజాగా డచ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ నేపథ్యంలో 5g వల్ల కలిగే లాభాలు ఏమిటి? నష్టాలేంటి?ఇంతకీ ఈ యాంటీ 5జీ జువెలరీ అవసరమేంటి? అయోనైజింగ్ రేడియేషన్ ను విడుదల చేసే 10 ఉత్పత్తుల జాబితాలో స్లీప్ మాస్క్,నెగిటివ్ అయాన్ ఎఫెక్ట్ అని చెప్పుకునే నెక్లెస్ లతోపాటు పిల్లల కోసం స్మైలీ యాంటీ రేడియేషన్ బ్రాస్లెట్స్ ఉన్నాయి. ఇలాంటి ఉత్పత్తులు నెదర్లాండ్స్ దేశ అణు శక్తి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నందున అక్కడ వీటి విక్రయం చట్టవిరుద్ధం. అయితే ఫ్రాంక్ ఫర్ట్ కు చెందిన మ్యాగ్నెటిక్స్ వెల్నెస్..

నిషేధిత జాబితాలో ఉన్న ఉత్పత్తులను నెదర్లాండ్స్ లోని వినియోగదారులకు నేరుగా విక్రయించకుండా జర్మనీ, స్వీడన్, యూకే కు షిప్పింగ్  చేస్తోంది.అయోనైజింగ్ రేడియేషన్ మూలంగా గుర్తించిన క్వాంటం లాకెట్ ఇప్పటికీ జపాన్ సహా కొన్ని అంతర్జాతీయ అమెజాన్ సైట్ లో అందుబాటులో ఉంది. ఈ యాంటీ 5జీ,యాంటీ రేడియేషన్ ఉపకరణాలు సాధారణంగా అగ్నిపర్వత బూడిద, టైటానియం, జియో లైట్, టూర్మాలీన్, జెర్మేనియం, మోనాజైట్ శాండ్, యురేనియం థోరియం వంటి సహజంగా సంభవించే రేడియోధార్మిక మూలకాలను కలిగి ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: