ఐటీ : పట్టా ఉన్నా.. పట్టు లేదు.. కారణం అదేనా..?

N ANJANEYULU
దేశ‌వ్యాప్తంగా సాప్ట్‌వేర్ ఉద్యోగ‌వ‌కాశాలు గ‌ణ‌నీయంగా పెరుగుతూ ఉన్నాయి. క‌రోనా త‌రువాత  ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. బ‌హుళ‌జాతి సంస్థ ప్రెష‌ర్ కు త‌లుపులు బారులుగా తెరుస్తున్నాయి. కానీ మార్కెట్ అవ‌స‌రాల‌కు త‌గ్గ మంచి.. సాంకేతిక‌త నిపుణ‌త మాత్రం వారిలో క‌నిపించ‌డం లేదు. ఏటా ప్ర‌ముఖ కంపెనీల‌లో మంచి వేత‌నాల‌తో ఉద్యోగాల‌లో చేరుతున్న వారి సంఖ్య‌కు నాలుగు రెట్ల‌కు మించి నిపుణులు ప్ర‌స్తుతం అవ‌స‌రం అని ఆయా కంపెనీలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా కంప్యూట‌ర్ సైన్స్‌.. డేటా సైన్స్‌, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ నిపుణుల‌తో పాటు ఇత‌ర మార్కెట్ అవ‌స‌రాల‌కు త‌గ్గ నిపుణులు కావాల‌ని చెబుతున్నాయి.
దేశ‌వ్యాప్తంగా ప్ర‌తీ సంవ‌త్స‌రం 14 ల‌క్ష‌ల మంది గ్యాడ్యుయేట్లు బ‌య‌టికి వ‌స్తుంటే.. వీరిలో మంచి కంపెనీల‌లో, వారి అర్హ‌త‌కు త‌గిన ఉద్యోగాలు, పొందుతున్న‌ది మ‌హా అయితే 4 శాత‌మే కావ‌డం నిపుణుల కొర‌త‌ను స్ప‌ష్టం చేస్తుంది. ద‌శాబ్ద కాలంగా సంప్ర‌దాయ డిగ్రీలు, ఇంజినీరింగ్ కోర్సుల‌ను విద్యార్థులు అస‌లు ఇష్ట‌ప‌డ‌డమే లేదు. ముఖ్యంగా ఎక్కువ‌గా కంప్యూట‌ర్ సైన్స్ కోర్సుల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఆ కోర్సులు చేసిన విద్యార్థుల‌లో చాలా మంది ఈత‌రం సాప్ట్‌వేర్ ఉద్యోగానికి ప‌నికి రావ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితుల‌లో బ‌హుళ‌జాతి కంపెనీల‌కు విదేశాల నుండి కూడా పెద్దఎత్తున సాప్ట్‌వేర్ ప్రాజెక్ట్‌లు వ‌చ్చాయి.
దీనిని దృష్టిలో పెట్టుకొని అన్నీ కంపెనీలు ప్రెష‌ర్స్‌ను స్కిల్స్ ప‌రిశీలిస్తూ ఉన్నాయి. కేవ‌లం కంప్యూట‌ర్ బేసిక్ లాంగ్వేజ్‌, మ‌హాఅయితే డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ గురించే వివ‌రిస్తున్నారు. కానీ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్‌, డీప్ లెర్నింగ్‌, నో సీక్వెల్‌, అడ్వాన్స్ టాపిక్ తెలిసుకున్న వాళ్లే కొత్త‌గా వ‌చ్చే ప్రాజెక్ట్ చేయ‌గ‌ల‌రు. అలాంటి అప్పుడు కేవ‌లం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ల‌ను రిక్రూట్ చేసుకుని ఏమి చేయాల‌ని నిపుణులు ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం ఐటీఐలో చ‌దివిన వారిలోనే మంచి నైపుణ్య‌ముంటుంద‌ని.. కానీ వారు విదేశాల‌కు వెళ్ల‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. కొత్త‌వాళ్ల‌ను తీసుకుని ట్రైనింగ్ ఇద్దామ‌న్నా.. వాళ్లు నేర్చుకునే లోపు ప్రాజెక్ట్ గ‌డువు పూర్తి అవుతుంది. ఇలాంటి పరిస్థితులో ఎంతో కొంత స్పీడ్‌గా ఉన్న వాళ్ల‌ను తీసుకొని ముందుకెళ్లుతున్నాయి కంపెనీలు. ఏదీ ఏమైనా ప‌ట్టా ఉన్నా.. కానీ మ‌న విద్యార్థుల‌కు ఆ స‌బ్జెక్ట్‌పై  ప‌ట్టు లేద‌ని చెప్ప‌వ‌చ్చు మ‌రీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: