బుల్లిపిట్ట: రూ.500 కే రియల్ మీ 8s5G స్మార్ట్ ఫోన్..!!

Divya
ఈ కామర్స్ దిగ్గజం సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్ తాజాగా ఇయర్ ఎండ్ ను పురస్కరించుకొని 5g స్మార్ట్ ఫోన్ లను భారీ తగ్గింపుతో మనకు అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్ లో రియల్ మీ 8s5G స్మార్ట్ ఫోన్ ను మనం కేవలం 549 రూపాయలకే మనం సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఆఫర్ వివరాలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి తెలుసుకుందాం..
రియల్ మీ 8s స్టోరేజ్ వేరియంట్ విషయానికొస్తే 8gb రామ్, 128gb స్టోరేజ్ వేరియంట్ తో లభిస్తున్న ఈ ఫోన్ ధర మార్కెట్ రేట్ ప్రకారం రూ.22,999 . కానీ ఫ్లిప్ కార్ట్ ఈ మొబైల్ ఫోన్ పై 13 శాతం డిస్కౌంట్ తో మనకు రూ.19,999 కే  అందిస్తోంది. 13 శాతం డిస్కౌంట్ అంటే మనకు ఏకంగా రూ.మూడు వేల తగ్గింపుతో ఎవరైనా సరే ఈ మొబైల్ ఫోన్ ను  కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్ కార్ట్. అంతేకాదు ఈ డిస్కౌంట్ తో పాటు మనకు ఇంకా కొన్ని డిస్కౌంట్లు కూడా ఈ ఫోన్ పై అందుబాటులో ఉండటం గమనార్హం.
అలాగే డెబిట్ కార్డ్,  క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి కూడా ఈ ఫోన్ మీరు రెండు వేల రూపాయల అదనపు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తాజాగా ప్రకటించింది. అంటే రూ.17,999 కే మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు సహాయంతో ఈ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపోయే మరొక విషయం ఏమిటంటే ఈ ఫోనే కనుక మనము ఎక్స్చేంజ్ చేసుకున్నట్లయితే రూ.17,450 భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు మీ స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఈ ఆఫర్ ను  త్వరగా అందుకోవచ్చు. అయితే మీరు ఈ ఆఫర్ పొందాలి అంటే ఫోన్ యొక్క కండిషన్ , మోడల్ ఆధారంగా ఎక్స్చేంజ్ కూడా ఆధారపడి ఉంటుంది. అలా అన్ని ఆఫర్స్  పూర్తిగా అప్లై చేసుకున్నట్లయితే ఈ ఫోన్ మీకు కేవలం 549 రూపాయలకే సొంతం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: