బుల్లి పిట్ట:హైడ్రోజన్ తో నడిచే సైకిల్స్..ధర ఎంతటే..!

Divya
అప్పట్లో ఎక్కువగా.. పెట్రోల్, డిజల్ తోనే వాహనాలు ఎక్కువగా నడిపే వాళ్లము. ప్రస్తుత కాలంలో ఎక్కువ గా cng, LPG, ఎలక్ట్రిక్ వంటి వాహనాలనే కొనుగోలు చేయడం జరుగుతోంది. ఇక ఇవి కాకుండా ఇతర వాహనాలు సైతం ఉపయోగిస్తే.. వాటివల్ల మన పర్యావరణం అంతా, ఎక్కువగా కార్బన్ తోనే నిండి ఉంటుంది. అందుచేత ఎక్కువగా అధునతన టెక్నాలజీతో ఉపయోగించే వాహనాలనే ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. ఇక అంతేకాకుండా ఈ వాహనాల గోల తో ఇబ్బంది పడేవారు.. ఎక్కువగా సైకిల్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ప్రస్తుతం ఇతర దేశాలలో సైతం ఎక్కువగా పర్యావరణం తగ్గించాలనే ఉద్దేశంతోనే.. ఎక్కువగా సైకిల్ లనే వాడుతూ ఉంటారు. సైకిల్ ని ఉపయోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలు ఎక్కువగా వాటిని ఇష్టపడుతున్నారు. అందుచేతనే ఎలక్ట్రిక్ సైకిల్ లు కూడా ప్రస్తుతం అందుబాటులోకి సరికొత్తగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అలా youon అనే సంస్థ ఒక సైకిల్ ను విడుదల చేసింది. ఈ సైకిల్ కు ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకునే సదుపాయంతో సీటు కింద అమర్చింది. ఇక ఈ సైకిల్ యొక్క ప్రత్యేకతలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఈ సైకిల్ సీటు కింద భాగాన హైడ్రోజన్ తో తయారుచేయబడిన.. ఒక బ్యాటరీను అమర్చి ఉంటారు. బ్యాటరీని ఒకసారి చార్జింగ్ చేసినట్లయితే..70 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని తెలియజేశారు. ఒక గంటలో కేవలం 24 కిలోమీటర్ వెళ్ళవచ్చు. ఈ సైకిల్ తో నిదానంగా తొక్కుతూ.. వెళ్లినప్పటికీ బ్యాటరీ సహాయంతో చాలా వేగంగా ముందుకు వెళుతుంది.2017 లో ఐయాన్ సమస్త ఒక హైడ్రోజన్ సైకిల్ విడుదల చేయడం జరిగింది. 2019 లో ట్రైల్ చేసేందుకు నిర్వహించారు అది విజయవంతంగా ముగిసింది. హైడ్రోజన్ బ్యాటరీ తో ఈ సైకిల్ నడిపేందుకు చాలా కష్టపడ్డామని ఆ సంస్థ నిర్వాహకులు తెలియజేశారు. దీని ధర కూడా తక్కువగానే ఉంటుందని. దీనిని సామాన్యులు కూడా కొనవచ్చట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: