
అలెర్ట్ : ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి? ప్రభుత్వానికి ఆ అనుమతి ఉందా ?
ఫోన్ ట్యాపింగ్ అంటే ఏమిటి?
ఫోన్ ట్యాపింగ్‌ను వైర్ ట్యాపింగ్ లేదా లైన్ బగ్గింగ్ అని కూడా అంటారు. అనుమతి లేకుండా మరొకరి సంభాషణను మరొకరు వినడం లేదా చదివితే, దానిని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఉదాహరణకు మీరు ఎవరితోనైనా ఫోన్‌లో మాట్లాడుతుంటే, సంభాషణలో పాల్గొన్న అవతలి వ్యక్తి కాకుండా మరొకరు మీ ఇద్దరి సంభాషణను రికార్డ్ చేసినా లేదా చదివినా దానిని వైర్ ట్యాపింగ్ అంటారు.
ఫోన్ ట్యాపింగ్‌ను ప్రభుత్వం అనుమతిస్తుందా ? ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమా?
భారతదేశంలో ఇది చట్టవిరుద్ధం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇలా చేయడం చట్ట విరుద్ధమా కాదా ? అనేది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం కూడా మీ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయదు. అయితే ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రభుత్వానికి ప్రత్యేక హక్కులు ఉన్నాయి. నిర్దిష్ట ప్రక్రియ కారణంగా ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే దీన్ని చేయగలదు.
ఫోన్ ట్యాపింగ్ చేస్తే ?
ఎవరైనా మీ ఫోన్‌ని ట్యాప్ చేస్తే అది మీ హక్కులలో ఒకదానిని ఉల్లంఘించినట్టని తెలుసుకోవాలి. ఈ హక్కు గోప్యత హక్కు. దీని కింద మీ ప్రైవేట్ సంభాషణను ఎవరూ రికార్డ్ చేయలేరు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) కింద ఫోన్ ట్యాపింగ్ ప్రస్తావించబడింది. 1990లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ఫోన్ ట్యాపింగ్ ఉదంతంతో ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. ఫోన్ ట్యాంపింగ్ గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు పేర్కొంది.
ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడు చేయవచ్చు?
ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ప్రభుత్వం కొన్ని పరిస్థితులలో మాత్రమే ఫోన్‌లను ట్యాప్ చేయడానికి అనుమతి ఉంటుంది. సెక్షన్లు (1) మరియు (2) కింద పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ ప్రయోజనం కోసం ప్రభుత్వం అలా చేయవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అనేక అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇలా ఎవరికైనా జరిగితే కోర్టును ఆశ్రయించే హక్కు అతనికి ఉంది.