మిస్డ్ కాల్ తో వాట్సప్ అకౌంట్... ఎలాంటి అనుమతులు ఇవ్వాలి?

Vimalatha
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారులు వాట్సాప్ మెసేజ్ యాప్ ను వాడుతున్నారు. అయితే దాన్ని వాడడానికి ముందుగా మొబైల్ నెంబర్ తో అప్లికేషన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ఖాతాను సృష్టించినప్పుడు లేదా ఇప్పటికే ఉన్న కథను మళ్లీ నమోదు చేసినప్పుడు మీ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో సహాయపడే మీ ఫోన్ నెంబర్ కు మీరే యజమాని అని నిర్ధారించుకోవాలి ఉంటుంది. లేదంటే మీ వాట్స్అప్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ అకౌంట్ ను నమోదు చేయడానికి రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ కోసం మీ ఫోన్ లో పనిచేస్తున్న సిమ్ కార్డు తో పాటు ఇంటర్నెట్ సెల్యూలర్ కనెక్షన్ ఉండాలి.


వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు రెండు వేర్వేరు స్క్రీన్ల కనిపిస్తాయి. అందులో ఒకటి రిజిస్ట్రేషన్, మిగిలిన 2-దశల ధృవీకరణ ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాతాలను మళ్లీ నమోదు చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్ సరైనదా నిర్ధారించడానికి ఎస్ఎంఎస్ లేదా ఫోన్ కాల్ ద్వారా పంపిన ఆరువందల రిజిస్ట్రేషన్ కోడ్ను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ కోడ్ తో మీ ఫోన్ నెంబర్ ను ధ్రువీకరించడం ఏకైక మార్గం. వాట్సాప్ లో మీ ఫోన్ నెంబర్ ను నమోదు చేసిన తర్వాత 2-దశల ధృవీకరణ స్క్రీన్ కనిపిస్తుంది. అది ఎందుకంటే మీ ఖాతా కు మరింత భద్రత జోడించడానికి.


వాట్సప్ కు ఎలాంటి అనుమతులు ఇవ్వాలి?
వాట్స్అప్ అందించిన సమాచారం ప్రకారం మిస్డ్ కాల్ తో రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ ఇస్తే వాట్సాప్ లో ఈ క్రింది ఇవ్వాల్సి ఉంటుంది.
కాల్స్ యాక్సిస్: ఇన్కమింగ్ ఫోన్ కళ్ళను యాక్సెస్ చేయడానికి వాట్సాప్ అనుమతి అడుగుతుంది.
కాల్ లాగ్ యాక్సెస్ : మీరు కాలేజ్ స్వీకరించిన తర్వాత తనిఖీ చేయడానికి వాట్సాప్ కి మీ కాళ్ళ యాక్సెస్ అవసరం.
మీరు ఈ రెండు అనుమతులను ఇచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి వాట్సాప్ దానంతట అదే కాలం కట్ చేస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి ముందు మీరు ఈ అనుమతులను ఇవ్వకూడదు అనుకుంటే ఎస్ఎంఎస్ ద్వారా ఫోన్ నెంబర్లు ధృవీకరించాలి. రిజిస్ట్రేషన్ పోటీ చేయడానికి ఎస్ఎంఎస్ ద్వారా మీకు పంపిన ఆరంకెల రిజిస్ట్రేషన్ కోడ్ను నమోదు చేయాలి. మీరు వద్దు అనుకుంటే ఎప్పుడైనా ఈ ఈ అనుమతులను నిలిపివేయాలని గుర్తుంచుకోండి. అనుమతులు ఇవ్వడానికి ఫోన్ లో సెట్టింగ్ లోకి వెళ్లి యాప్ లు, నోటిఫికేషన్, వాట్సాప్, ఇక్కడ అనుమతులు క్లిక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: