ఏపీని విడువని వర్షాలు.. 24 గంటల్లో భారీగా..!

MOHAN BABU
 ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో  వర్షాల ధాటికి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వాన దెబ్బకు రోడ్లు, భవనాలు రైతులు పంటలు మొత్తం నేలపాలయ్యాయి. ఆ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మళ్లీ వర్ష సూచన వచ్చింది. మొన్నటి వరకు కురిసిన వానలకు నెల్లూరు, కడప, తిరుపతి , రాయలసీమ జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. చూస్తుండగానే బిల్డింగులు ఇల్లు కూలి చాలా మంది రోడ్డున పడ్డారు. ఎంతో మంది మృతి చెందారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలన కూడా చేశారు. వరదల ధాటికి నష్టపోయిన  వారందరికీ పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహకారం కూడా అందిస్తున్నారు. ఈ తరుణంలోనే మళ్లీ మరోమారు వర్ష సూచన వచ్చింది.. అది ఏంటో తెలుసుకుందాం..?


నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న, వాయుగుండం వలన రాబోయే 24 గంటల్లో మరింత బలపడి, తుఫాను గా బల పడనుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి 770 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా గోపాల్పూర్ కు 850 కిలోమీటర్లు.. పారాదీప్ కి 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  నాలుగో తేదీ తెల్లవారుజామున ఉత్తర కోస్తా దక్షిణ ఒరిస్సా మధ్య తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని సూచించారు.  దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు పశ్చిమ గోదావరిలో కూడా పలు చోట్ల విస్తారంగా వర్షాలు రెండు చోట్ల భారీ వర్షాలు, ప్రస్తుతం తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు బయటకు వెళ్లకూడదు. తీరం దాటే సమయంలో 80 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: