ఓ కాసు చేతిలో పడాలంటే ఆలోచన ఉండాలి. ఆలోచన కార్యరూపం దాల్చాలంటే కష్టం కనిపించాలి. కష్టం చెమటగా మారి ఆ చెమటలోంచి వచ్చిన తెచ్చిన కాసులు కలకాలం ఉంటాయి. అలా కాదు రాత్రి పడుకుని పొద్దున్న లేసే వరకు ఓ అద్భుతం జరగాలి, కోట్లకు కోట్లు కళ్ళముందు కదలాలి అనుకుంటే అదృష్టం బాగుంటే కదులుతాయేమో. కష్టం తెల్సిన కాసు అదే కష్టం కనిపించకపోతే వేరే అడ్రస్ వెతుక్కుంటుంది. అందరూ ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. తమనుతాము ప్రమాదంలో పడేయడంతో పాటు చుట్టూ ఉన్న సమాజాన్ని, దేశాన్ని ప్రమాదంలోకి పడేస్తున్నారు. మరి దీనికి చెక్ పడాలంటే ఎలా..? మార్పు ఎక్కడి నుంచి మొదలు కావాలి..? రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులు అయిపోవాలని జూదానికి అలవాటుపడి రోడ్డున పడ్డ వాళ్ళు ఎంతోమంది. జూదం నుంచి పేకాట,
పేకాట నుంచి ఆన్లైన్ రమ్మీ మధ్యలో మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇప్పుడు క్రిప్టోకరెన్సీ రూపం ఏదైనా ఈజీ మనీ వైపు ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. దిగాక నిండా మునిగి పోతున్నారు. ఈజీ మనీ కోసం వెంపర్లాడే గుణమే, ఆన్లైన్ రమ్మీ అనే జి దానికి ప్రాణం పోసింది. 13 ముక్కలాట రోడ్డున పడేసిన బతుకులు ఎన్నో ఇదే జనాల్లో ఈ ఆశలు ఆయుధంగా మార్చుకుని బురిడీలు కొట్టించినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇప్పుడు క్రిప్టోకరెన్సీ రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. రోజు గడిచే లోపు విలువ అమాంతం పెరిగిపోతుంది. బిట్ కాయిన్ పేరు మాత్రమే ఎక్కువగా ప్రచారంలో వినిపిస్తున్న, అలాంటి క్రిప్టోలు అనేకం ఉన్నాయి. ఓ ఫోన్ నుండి యాప్ ఉంటే చాలు ఈజీగా ట్రేడింగ్ చేయొచ్చు.
క్రిప్టో వ్యవహారంలో ఏ దేశంలో ఎలాంటి నిబంధనలు లేవు. అదే ఇప్పుడు ప్రమాదకర పరిణామంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఘటనలు చూస్తే యువతలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ తో మోసపోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ అదృష్టాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వారు ఎవరూ లేరు. అలా వచ్చిన ఎక్కువ రోజులు నిలవలేదు.