బుల్లి పిట్ట: ఈ ఒక్క యాప్ తో అన్ని డాక్యుమెంట్లను దాచేయచ్చట..!!

Divya
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు అవసరమైన వాటిలో ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, పాన్ కార్డు వంటివి చాలా ముఖ్యం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మన పనులు జరగవు. ఎటువంటి ట్రాన్సాక్షన్ కైనా కచ్చితంగా ఆధార్ కార్డు అవసరమే. మరి అలాంటి కార్డ్స్ మనకి ఒకానొక సమయంలో అందుబాటులో లేకపోతే చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే అలాంటి సమయంలో చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకోసమే సెంట్రల్ గవర్నమెంట్ వర్చువల్ లాకర్ ను కూడా ప్రారంభించింది.

ఇక వాటితో పాటే ఒక డిజిటల్ లాక్ అనే సదుపాయని కూడా కల్పించింది. అయితే దానిని ఎలా ఉపయోగించుకోవాలి. మన దగ్గర ఉండి ఎటువంటి ఓటర్ కార్డ్, పాన్ కార్డ్, మరియు ఏ ఇతర సర్టిఫికెట్లు అయినా కూడా భద్రంగా దాచుకో వచ్చట. అందుకోసం మీరు ముందుగా డిజిటల్ లాకర్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. Https://digilicker.gov.in  దీనిలో క్రియేట్ చేసుకోవాలి.
ముందుగా ఈ యాప్ లో మన యూజర్ నేమ్, పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత అందులో డాక్యుమెంట్లని అప్ లోడ్ చేసుకోవాలి. అంతే కాకుండా పిడిఎఫ్ వంటి వాటిని కూడా ఇందులో స్నాప్ చేసి ఇ సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మన దగ్గర ఉండే ఎటువంటి కార్డ్స్ కాకుండానే, ప్రభుత్వం నుంచి వచ్చిన ఎటువంటి సర్టిఫికెట్లు అయినా మనం ఈ డిజిటల్ లాకర్లు చాలా భద్రం గా ఉంచుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా మనం సేవ్ చేసుకున్న డాక్యుమెంట్లు అన్నిటిని మనం ఏదైనా అత్యవసర సమయాలలో మనం ఉపయోగించుకోవచ్చు. వివాహం చేసుకున్నాడు మనల్ని ఏ అధికారి అయిన తనిఖీ చేసేటప్పుడు వీటిని డాక్యుమెంట్ ప్రూఫ్ కింద చూపించు కోవచ్చు. ఇక ఇది గవర్నమెంట్ నుంచి జారీ చేసిన యాప్ కనుక ఇది ఒరిజినల్ లాగానే ఉంటుంది. ఇది మన స్మార్ట్ ఫోన్ లోనే యూజ్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: