పేటిఎం పీకేసింది, ఇన్వెస్టర్ ల సొమ్ము ను ఊడ్చేసింది.దేశంలోనే తిరుగులేని డిజిటల్ పెమెంట్స్ కంపెనీ కాస్త లాభాలు ఆర్జించి పెడుతుంది అనుకుంటే ఐపిఓ రూపంలో నిండా ముంచేసింది. పేటీఎం కరో అంటూ దేశాన్ని డిజిటల్ పేమెంట్స్ వైపు నడిపించిన సంస్థ చిన్న మదుపుదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మార్కెట్ భూమిని చూసి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడితే ఒక్కోసారి నీటి బుడగలాగా పేలిపోతాయి. ఈ మధ్య వచ్చిన ఐపీవో లో చాలా వరకు లాభాల పంట పండించాయని, అన్నింటిని అలాగే చూస్తే ఇన్వెస్టర్ లు అడ్డంగా బుక్కయిపోతారు.
కంపెనీ ఫైనాన్షియల్ బ్యాగ్రౌండ్ చెక్ చేసుకోకుండా వాపును చూసి బలుపు అనుకుంటే చివరికి చిన్న ఇన్వెస్టర్ల కష్టార్జితం అంతా ఆవిరైపోతుంది. దీనికి అతి పెద్ద ఉదాహరణ పేటీఎం ఐపీఓ. మొత్తం 18 వేల మూడు వందల కోట్లతో దేశంలో అతిపెద్ద ఐపీఓ గా మార్కెట్ లోకి వచ్చిన పేటీఎం ఊరించి ఉసూరుమనిపించింది. పేటీఎం ప్రమోటర్లు నమ్మి పెట్టుబడులను పెట్టిన మదుపరులకు మొదటి రోజే భారీ షాక్ తగిలింది. వాస్తవానికి ఈ ఐపీఓ కు 1.89 రెట్లు అధికంగా బిల్డింగ్ వచ్చాయి. కేవలం భారత్లోనే కాదు ఆసియా ప్రాంతంలో కూడా ఇదే అతి పెద్ద ఐపిఓ. చెప్పుకోవడానికి ఇంత ఘనంగా ఉన్న ప్రాక్టికల్గా మాత్రం 9% డిస్కౌంట్తో లిస్టింగ్ అయ్యి తుస్సుమనిపించింది. ఐపిఓ లో ఆఫర్ ప్రైస్ ధర షేర్ 2150 రూపాయలు ఉంటే లిస్టర్ల ధర 1950 రూపాయలు. ట్రేడింగ్ ముగిసే సమయానికి 1560 రూపాయలు పడిపోయి27 శాతానికిపైగా నష్టపోయింది. డిమానిటైజేషన్ టైంలో డిజిటల్ పేమెంట్స్ కోసం అంటూ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది పేటీఎం సంస్థ. జస్ట్ స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్కుతో ఎలాంటి పేమెంట్స్ అయినా చేయొచ్చంటూ దేశ ప్రజలకు డిజిటల్ ట్రాన్సాక్షన్లు రుచి చూపించింది . గల్లీలో టీ కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడైనా సరే అధిక నోట్లకు ప్రత్యామ్నాయంగా డిజిటల్ పేమెంట్స్ మొత్తం పేటీఎంలోనే జరిగే స్థాయికి వెళ్ళింది. వాస్తవానికి పేటీఎం పేటెంట్ కంపెనీ 97 కమ్యూనికేషన్స్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.
గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎం 17 వందల కోట్ల నష్టాలను చవిచూసింది. అంతకు ముందు 2019-20 లో 2942 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకుంది. నష్టాలు వెంటాడుతున్న కూడా ఓవర్ వాల్యూతో మార్కెట్లోకి వచ్చింది. నష్టాలు పట్టించుకోకుండా మార్కెట్లో పోటీ చూడకుండా ధర నిర్ణయించింది. అదే ఇన్వెస్టర్లకు శాపంగా మారింది. కేవలం భూమిని చూసి ఆశపడ్డ ఇన్వెస్టర్లకు పేటీఎం కొంప ముంచపోతుందన్న విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.