బుల్లిపిట్ట:ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి..శుభవార్త తెలిపిన ఫ్లిప్ కార్ట్..!
Love it or return it అనే పేరుతో ఒక ప్రోగ్రాం ను ప్రారంభిస్తోందట. ఇది ముందుగా బెంగళూర్, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాలలో ప్రారంభం చేశాము అన్నట్లుగా తెలియజేస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ మధ్యకాలంలో భారతదేశంలో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరగడంతో ఇలాంట ఒక ప్రోగ్రాం ని విడుదల చేశామని తెలియజేసింది. ఇకమీదట ప్రీమియం యూజర్స్ మొబైల్ ని కొన్న తర్వాత 15 రోజుల వరకు వాడుకొని.. ఆ తరువాత నచ్చకపోతే తిరిగి ఇవ్వచ్చు అన్నట్లుగా తెలియజేశారు.
అందుకోసం ప్రముఖ బ్రాండ్ సంస్థ సాంసంగ్ తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. అయితే మొబైల్ అలా తిరిగి వాపస్ పంపించినప్పుడు పూర్తిగా చెక్ చేస్తారట. స్మార్ట్ మొబైల్ లో ఎలాంటి ఇబ్బందులు, మార్పులు లేకపోతే కస్టమర్ అమౌంట్ మొత్తం రిఫండ్ చేస్తుందట. ఆ అమౌంట్ మొత్తం కస్టమర్ అకౌంట్ లోనే జమ చేస్తారట.
ఇటువంటి సదుపాయాన్ని ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, ముంబై వంటి నగరాలలో కూడా ఈ క్రేజీ ఆప్షన్ ను మొదలు పెట్టింది. కస్టమర్లు అత్యంత ఖరీదైన మొబైల్స్ కొని ఆ మొబైల్ ఎలా ఉంటుందో అన్న సందేహం కస్టమర్లలో ఉండకుండ ఉండేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు గా ఫ్లిప్ కార్ట్ సంస్థ తెలియజేసింది. ఇలా చేయడం వల్ల యూజర్స్ కు చాలా మేలు జరుగుతుంది.