భారత డ్రోన్.. ఘాతక్..!

యుద్ధం అంటే గతంలో రెండు వైపులా ప్రాణనష్టం తప్పని పరిస్థితి. అయితే వచ్చే కొద్దీ ఆ నష్టం తగ్గించాలనే ఉద్దేశ్యంతో కొత్త కొత్త సాంకేతికతను రూపొందిస్తున్నాయి ఆయా దేశాలు. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా డి.ఆర్.డి.ఓ. సహకారంతో అదే తరహా ప్రయోగాలు చేస్తూ వస్తుంది. గతంలో లాగా బలం ఉన్న సైనికుడు శత్రువులను చంపుకుంటూ ముందుకుపోయే పరిస్థితుల నుండి కొత్త సాంకేతికత మరో స్థాయికి తీసుకెళ్తుంది. అంటే ఎంత త్వరగా శత్రు స్థావరాలలోకి చొరబడి వాళ్ళను తుక్కుతుక్కు చేయగలిగితే అంత త్వర యుద్ధం ముగిసిపోతుంది అనేది ఈ సాంకేతికత ప్రధానాంశం. అంటే మరణాల రేటు తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు అణుబాంబు మాదిరి.

అయితే దానికి ప్రకృతి ని పూర్తిగా అణు బాంబు లాగా నాశనం చేసేవి కాకుండా కూడా ఈ ఆయుధాలు ఉండాలనేది మరో అంశం. తద్వారా ప్రాణనష్టం జరిగినప్పటికీ, ప్రకృతి నష్టపోదనేది ఇక్కడ ప్రధాన మైన విషయం. యుద్దాలు తప్పనప్పుడు కనీసం ఈ జాగర్త అయినా తీసుకోవాలి అనేది ఆయా దేశాల ఉమ్మడి ఒప్పందం. అయితే యుద్ధం వరకు వచ్చాక ఈ ఒప్పందాలు నిజంగా నిలబెట్టుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయా దేశాలు మాత్రం విధ్వంసక ఆయుధాలు మాత్రం తయారు చేసుకుంటున్నాయి.  భారత్ ఈవిషయంలో చాలా దేశాల కంటే మెరుగ్గానే ఉంది. ఎప్పుడు ఆయుధాల జోలికి పోనీ భారత్ యుద్ధం అంటే మాత్రం వాటితో పని ఉంటుంది కాబట్టి తయారీ లేదా కొనుగోలు చేస్తూనే ఉంటుంది.  

తాజాగా దేశీయంగా తయారైన డ్రోన్ ఒకటి పరీక్షించారు. మరో రెండేళ్లలో ఇది అందుబాటులోకి రానుంది. డ్రోన్ అంటే చిన్నది కాదు, దీనితో శత్రువుపై ఆకస్మికంగా భారీగా దాడి చేసి వచ్చేయవచ్చు. శత్రువు ప్రాణ నష్టం తప్ప మనకు ఏమీ నష్టం ఉండదు. దీనిపేరు ఘాతక్ అని పెట్టారు. కర్ణాటకలోని చిత్ర దుర్గ దగ్గర దీనిని నేడు పరీక్షించారు. చైనా సరిహద్దు కవ్వింపుల నేపథ్యంలో దీనిని ఇంకా త్వరగా తెరపైకి తేవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది 30వేల అడుగులలో ఎగురగలదు, దీనితో క్షిపణులను, ఇతర బాంబర్లను ప్రయోగించవచ్చు. 190 కిమీ వేగంతో ఈ డ్రోన్ ప్రయాణిస్తుంది. 4 మీటర్లపొడవు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి 200 కిమీ నుండి కూడా ఆదేశాలు ఇవ్వవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: