ప్రపంచంలోనే మొట్టమొదటి 75 అంగుళాల 8K 265Hz టెక్నాలజీ టీవీ... ఫీచర్లు ఏంటంటే ?

Vimalatha
చైనీస్ కంపెనీ TCL అనేక ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తూ మార్కెట్ లో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. అయితే దీని ప్రొడక్టులలో టీవీలకు మంచి ప్రజాదరణ ఉంది. అందుకే టీవీల విభాగంలో ఇంతకు ముందెన్నడూ లేని సరికొత్త టెక్నాలజీని కంపెనీ ఇప్పుడు ప్రకటించింది. కంపెనీ 75 అంగుళాల 8K 265Hz టీవీ టెక్నాలజీని పరిచయం చేయబోతున్నట్టు ప్రకటించింది.TCL ప్రకారం వారు టీవీ పిక్చర్ నాణ్యతను మాత్రమే కాకుండా దాని రిఫ్రెష్ రేట్‌ను కూడా మెరుగు పరిచే సాంకేతికతను అభివృద్ధి చేశారు. నిజానికి అధిక రిఫ్రెష్ రేట్ గేమింగ్, యాక్షన్ సినిమాలు చూసేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ప్రసిద్ధ టీవీ కంపెనీ గత సంవత్సరం తన మొదటి తరం 8K 1G1D టెక్నాలజీని ప్రదర్శించింది. 2021 సంవత్సరపు ఈ కొత్త సాంకేతికత కొత్త రికార్డులను నెలకొల్పుతుంది. ఇది మెరుగైన చిత్ర నాణ్యత, మెరుగైన రిఫ్రెష్ రేట్ మాత్రమే కాకుండా తయారీ ప్రక్రియ కూడా మెరుగ్గా ఉంటుంది. 8K 1G1D టెక్నాలజీలో H-HVA చేర్చారని సమాచారం. అలాగే ఇందులో 4 మాస్క్ టెక్నాలజీని పొందుపరిచారు. ఇది సూపర్ ఫ్లూయిడ్ 265Hz 8K 1G1D డిస్‌ప్లేను ఇస్తుంది.
ప్రస్తుతం 8K స్మార్ట్ టీవీలు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తున్నాయి, అయితే 265Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన డిస్‌ప్లే ఒక పెద్ద అచీవ్‌మెంట్. ఇది మెరుగైన చిత్ర నాణ్యతను అందించడమే కాకుండా మెరుగైన స్క్రీన్ రేట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీకి ప్రత్యేక HCC రో వేరియబుల్ ఛార్జింగ్ ఫీచర్ జోడించారు. ఇది హై-డ్రైవ్ goa , సర్క్యూట్ డిజైన్‌ లో వస్తుంది. ఈ డిజైన్ 8K CSPI ఇన్-స్క్రీన్ హై-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది ప్రసార ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. మొత్తానికి TCL ప్రపంచంలోనే మొట్టమొదటి 85-అంగుళాల 120Hz 1G1D హై-ఎండ్ LCD డిస్‌ప్లేను కూడా ప్రకటించింది, ఇది IGZO టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకా  కమర్షియల్ లాంచ్ తేదీని ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: