యూట్యూబ్ మ్యూజిక్ ప్రియులకు షాక్... ఇకపై ఆ ఆప్షన్ ఉండదు !

Vimalatha
గూగుల్ ఇటీవల యూట్యూబ్ మ్యూజిక్ కు ఉచిత ప్లేబ్యాక్ ఆప్షన్ ను అందించింది. వినియోగదారులకు దీనివల్ల ఉపయోగమే కానీ... ఇకపై ప్రీమియం చెల్లించకపోతే ఒకేసారి ఆడియో, వీడియోను ఆస్వాదించలేరు. ఇప్పటి వరకు యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లు యాప్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే సంగీతాన్ని వినగలరు. కానీ కొత్త బ్యాక్‌గ్రౌండ్ ప్లేబ్యాక్ సపోర్ట్‌తో కంపెనీ యాడ్-సపోర్ట్ సర్వీస్‌లో మార్పులు చేసింది. యూజర్లు తమకు ఇష్టమైన పాటలను బ్యాక్‌గ్రౌండ్ ప్లేతో ప్రసారం చేయవచ్చు. అంటే యాప్ ఓపెన్ చేయకుండా కూడా మ్యూజిక్ వినవచ్చు.
ఏదేమైనా ఉచితంగా యాప్ ను ఉపయోగించే వినియోగదారులు యాప్ వీడియో స్ట్రీమింగ్‌లోని మరొక ఉపయోగకరమైన ఫీచర్‌ను కోల్పోబోతున్నారు. కంపెనీ త్వరలో మ్యూజిక్ వీడియో వీక్షణను ప్రీమియం-టైర్‌కి మాత్రమే పరిమితం చేస్తుంది. దీని అర్థం యూట్యూబ్ మ్యూజిక్ ఉచిత వినియోగదారుల కోసం ఆడియో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రీమియం వినియోగదారులకు మాత్రమే ఆడియోతో పాటు వీడియో కూడా అందుబాటులో ఉంటుంది. అయినప్పటికీ సాధారణ యూట్యూబ్ లో వీడియోలను చూడొచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో సంగీతం వినడం, షఫుల్ ప్లే, ఫేవరెట్ మిక్స్‌లు, లక్షలాది పాటలు, వేలాది ప్లే జాబితాలను ఉచిత ఆప్షన్ లో ఉచితంగానే సెర్చ్ చేయొచ్చు. యూట్యూబ్ మ్యూజిక్‌లో వినొచ్చు కూడా. వీడియో చూడటం మాత్రం ప్రీమియం-టైర్‌లో ప్రకటన రహిత స్ట్రీమింగ్ ఉంటుంది.
నవంబర్ 3 నుండి మార్పులు
ఈ మార్పు నవంబర్ 3 నుండి ప్రారంభమవుతుంది. అదే రోజు బ్యాక్ గ్రౌండ్ ప్లేబ్యాక్ సపోర్ట్ ప్లాట్‌ఫారమ్‌పై విడుదల చేయబడుతుంది.  ఈ మార్పు మొదట కెనడాలో స్టార్ట్ అవుతుంది. తరువాత ఇతర ప్రాంతాలు కూడా దీనిని అనుసరిస్తాయి. ఆడియో మాత్రమే రావడం, విజువల్స్ రాకపోవడం కొంతమంది వినియోగదారులను ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఈ మార్పు బహుశా ఆపిల్ కొత్తగా ప్రారంభించిన వాయిస్ ప్లాన్ ప్రభావం అని నివేదికలు సూచిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: