ఆన్‌లైన్‌లో హెల్త్ ఐడి కార్డు... ఇలా అప్లై చేయండి

Vimalatha
దేశంలో హెల్త్ ఐడి కార్డ్ ప్రారంభమైంది. ఇటీవల ప్రధాని దీని గురించి వివరంగా చెప్పారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఆరోగ్య ID ని సులభంగా పొందవచ్చు. వన్ నేషన్ వన్ హెల్త్ ఐడి కార్డ్ మిషన్ కింద ఈ కార్డులు ప్రజలకు జారీ చేస్తోంది ప్రభుత్వం. దీని కోసం Healthid.ndhm.gov.in ఓపెన్ చేయాలి.
పైన పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
హెల్త్ ఐడిని ఇప్పుడే క్రియేట్ చేయండి అనే దానిపైఓపెన్ అవుతుంది. దానిపై క్లిక్ చేయడం చేస్తే హెచ్చరిక పేజీ కన్పిస్తుంది. ఇందులో ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో హెల్త్ ఐడిని సృష్టించే పని ప్రారంభమైందో తెలుస్తుంది. ఇందులో కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
ఆధార్ ద్వారా జనరేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోవాలి.
మీకు ఆధార్ ఉంటేనే ఈ ఆప్షన్‌ని ఉపయోగించగలరు. దీని కోసం మీ ఆధార్ కార్డుతో మొబైల్ నంబర్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం.
ఆధార్ లేకపోతే 'ఇక్కడ క్లిక్ చేయండి' పై క్లిక్ చేయండి. ఆ తర్వాత జనరేట్‌ వయా మొబైల్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. దానికన్నా ముందు నేషనల్ హెల్త్ అథారిటీ సూచనల ప్రకారం అగ్రిమెంట్ బాక్స్‌ చెక్ చేయాలి.
ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత, మీ మొబైల్ ఫోన్‌లో OTP వస్తుంది. దానిని OTP బాక్స్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
దీని తర్వాత ఆరోగ్య ID కార్డు కోసం ఫామ్ ఓపెన్ అవుతుంది.
దీనిలో పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం మొదలైన సమాచారాన్ని ఇవ్వాలి. ఇమెయిల్ ID ఉన్నట్లే, ఆరోగ్య ID చిరునామా కూడా ఉంది. మీరు ఈ ID ని ఏ ఆసుపత్రిలోనైనా షేర్ చేయవచ్చు. దీని కోసం మీరు పాస్‌వర్డ్‌ని కూడా సృష్టించాలి.
ఈ మొత్తం సమాచారం ఇచ్చిన తర్వాత పేజీలో అభినందన సందేశం వస్తుంది. మీ ఆరోగ్య ID విజయవంతంగా క్రియేట్ అయినట్టు.    ఈ పేజీలోకి వెళితే, దిగువ QR కోడ్ కనిపిస్తుంది. ఇది మీ డిజిటల్ హెల్త్ కార్డ్. ఇందులో మీ మొత్తం సమాచారం నమోదు అవుతుంది.
మీరు కార్డ్ క్రియేట్ చేయొద్దు అనుకుంటే, ఈ QR కోడ్ హెల్త్ ID గా కూడా పని చేయవచ్చు. దీనితో పాటు ఆరోగ్య ID కూడా ఇమెయిల్ ID లాగా వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: