భారత్ : అంతరిక్ష ప్రయోగాలవైపు.. ప్రైవేట్ సంస్థల చూపు.. !

ఎలెన్ మాస్క్ ప్రభావం చాలా తొందరగా ఆయా దేశాలపై పడుతుంది. దీనితో ప్రైవేట్ రంగ ప్రవేశం అంతరిక్ష పరిశోధనలలో జోరుగా జరుగుతుంది. భారత్ లో కూడా ఈ తరహా ఉత్సాహం ప్రైవేట్ సంస్థలలో కనిపిస్తుంది. ఈ సంస్థలు రాకెట్లు నిర్మించడం, లాంచింగ్ వెహికల్స్, ఉపగ్రహాలు ప్రయోగించడం, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చడం లాంటివి చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇప్పటికే చెప్పుకోదగ్గ ఎన్నో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఇస్రో విజయాలతో ఇతర దేశాలు కూడా వారి పరికరాలను భారత్ లో చేయించడం మొదలుపెట్టాయి.
ఇస్రో విజయాలతో ముందుకుపోతూ ఇతర దేశాల సాటిలైట్ లను కూడా అంతరిక్షంలో ప్రవేశపెడుతూ ఉంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. దీనితో భారత్ శక్తిసామర్ద్యాలు మరియు భారత్ కు అంతరిక్ష పరిశోధనలో ఉన్న ఆసక్తిని కూడా ప్రపంచం గమనిస్తూనే ఉంది. దీనివలన ఈ రంగంలో కూడా రానున్న కాలంలో భారత్ సరికొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలడు, కొత్త విజయశిఖరాలను అందిరోహించగలదు. ఇక ప్రైవేట్ రంగం మాత్రం ఈ పరిశోధనలలో ఆసక్తి కనపరుస్తూనే ఉన్నాయి. దానికి కూడా ఇస్రో విజయాలు కారణం అనే చెప్పాలి. ఆ సంస్థ విజయాలు ప్రపంచం దృష్టిని భారత్ వైపు మళ్లించడం వలన అవకాశాలు మెరుగ్గా వస్తున్నాయి.
మొదటి నాలుగు సంస్థలు కూడా భారత్ వైపు చూడటం ఆనందించదగ్గ విషయం. స్కై రూట్ ఏరో స్పేస్, అగ్ని కుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్ ఏరోస్పేస్ లు భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. బెల్లాస్టిక్స్ శాటిలైట్ ప్రొపల్షన్ లో ప్రత్యేకత కలిగింది. పిక్సెల్ సూక్ష్మ ఉపగ్రహాల పై పరిశోధిస్తుంది. అగ్నికుల్ ప్రస్తుతం అగ్నిబాన్ను ను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది. స్కై రూట్ విక్రమ్ శ్రేణి రాకెట్లపై పని చేస్తుంది. ఈ సంస్థలన్నీ ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనలో ఆయా విభాగాల కోసం పనిచేస్తున్నవే. అయితే తాజా నిర్ణయంతో ఇవి విస్తరిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఈ పరిశోధనలు సఫలీకృతం అవటంతో భారత్ ఈ దిశగా కూడా ముందడుగు వేసి ప్రపంచంలో తన స్థాయిని సుస్థిరం చేసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: