నాసా : మార్స్ ప్రయోగాలలో.. పురోగతి.. !

మార్స్ పై ఎప్పటి నుండో అనేక ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా నాసా అయితే ఇప్పటికే ఎన్ని ప్రయోగాలు చేపట్టిందో! భూమిని పోలి ఉన్న గ్రహంగా దానిని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు దానిపై మనిషి సంచారం సహా పలు అంశాలపై ప్రయోగాలు చేస్తున్నారు. భూమి తరువాత మనిషి ఆశ ఈ మార్స్ మాత్రమే. అంటే ఉన్న భూమిని సాంకేతికత పేరుతో నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైనా ఇంకో దారి కోసం వెతకడం సహజమే కాబట్టి ఇదిలేకపోతే ఎటు వెళ్ళాలి అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ గ్రహాల వేట. ఒక్కసారి దానిని కనిపెట్టిన తరువాత దానిపై మనిషి నివసించదగ్గ పరిస్థితులు ఉంటాయో లేదో అనేదానిపై స్పష్టమైన పరిశోధన చేస్తూనే ఉన్నారు. దానికోసం మానవరహిత రోవర్లను మార్స్ పై కి తరలించి వాటిద్వారా నాసా సహా పలు సంస్థలు మార్స్ పై మనిషి జీవించడానికి తగిన పరిస్థితులు ఉన్నది లేనిది పరీక్ష చేస్తున్నారు.
తాజాగా నాసా కు మార్స్ పై నీరు ఉండేది అనే ఆనవాళ్లు లభించాయని చెపుతుంది. నాసా దీనికోసం అంతరిక్షం లోకి పెర్సెవారెన్సు రోవర్ ను పంపిన విషయం తెలిసిందే. అది జెజెరో బిలంలో ల్యాండ్ అయ్యింది. అక్కడ ఎప్పటిదో సరస్సు లేదా నది ఆనవాళ్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజాగా రోవర్ పంపిన చిత్రాలను శాస్త్రవేత్తలు పరిశీలించి, ఒకప్పుడు అక్కడ సరస్సు ఉండేదని, అదికూడా డెల్టా ఒడ్డున ఉండేదని వారు అంటున్నారు. ఇక శిఖరాల లోపలి పొరలు దాని నిర్మాణం జరిగిన విధానాన్ని స్పష్టం చేస్తుంది. ఈ చిత్రంలో దిగువన ఉన్న మూడు పొరలు ఆకారం అప్పటి ఉనికి, స్థిరమైన నీటి ప్రవాహం చూపించారు. ఇది దాదాపు 3.7 బిలియన్ ఏళ్ళనాటి మార్స్ ఒక హైడ్రొలోజికల్ లైఫ్ లైన్ కు మద్దతు ఇచ్చేంత వెచ్చగాను, తేమగాను ఉంటుంది అని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
ఇటీవల ఈ పొరలలో మీటర్ కనే ఎక్కువ వ్యాసం కలిగిన రాళ్ళు చెల్లా చెదురుగా ఉన్నాయి. అంటే అక్కడ భయానకమైన వరదలు సంభవించి ఉండవచ్చు అని పరిశోధకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  అక్కడి మట్టిని, శిలల కోసం రోవర్ ను ఎక్కడ పంపించాలో గుర్తించడంలో పరిశోధకులు సాయం చేశారు. నాసా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందటానికి  దశాబ్దాల కాలాన్ని, బిలియన్ డాలర్ల ఖర్చు చేసింది. ఇన్నేళ్ళుగా రోవర్ సాయంతో మార్స్ పై ఉన్న మట్టి మరియు రాళ్లను 30 శాంపిళ్ళ వరకు సీల్డ్ కవర్ ట్యూబ్ లలో సేకరించింది. అనంతరం 2030 వ ఏట ఎప్పుడైనా ఈ శాంపిళ్లను భూమికి రోవర్ పంపిస్తుంది. ఈ విశ్లేషణ కూడా పూర్తి అయితే ఫొటోలో ఉన్న ప్రాంతంలో నీరు ఉన్నది లేనిది స్పష్టం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: