బుల్లి పిట్ట: డబ్బులు లేకపోయినా.. రూ.70 వేల వరకూ వస్తువులు కొనుగోలు చేయవచ్చట..?

Divya
 
ఏంటి డబ్బులు లేకపోయినా సరే. 70 వేల రూపాయల వరకు వస్తువులను కొనుగోలు చేయవచ్చా ..? ఎవరిస్తారు ఈ కాలంలో అంత ఉదారంగా..? అని ఆలోచిస్తున్నారా..? నిజమే ఈ పండుగ సందర్భంగా ప్రస్తుతం మీరు ఒక రూపాయి చెల్లించకుండానే, ఏకంగా 70 వేల రూపాయల వరకు షాపింగ్ చేసే అవకాశాన్ని మీకు ఫ్లిప్ కార్ట్ కల్పిస్తోంది. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్లిప్ కార్ట్ లో 70 వేల రూపాయల వరకు ఎలా షాపింగ్ చేయవచ్చు..అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న సరికొత్త ఆఫర్ ఫ్లిప్ కార్ట్ పే లేటర్.. ఇందులో మీరు ఒక రూపాయి కూడా చెల్లించకుండానే ఏకంగా 70 వేల రూపాయల వరకు షాపింగ్ చేసి , ఆ మొత్తాన్ని మీరు వాయిదాల పద్ధతిలో కూడా చెల్లించవచ్చు. ఇందులో మూడు నెలలకు, ఆరు నెలలకు, తొమ్మిది నెలలకు, పన్నెండు నెలలకు.. ఇలా ఈఎంఐ ఆప్షన్ ద్వారా మీరు షాపింగ్ చేసిన మొత్తాన్ని నిర్ణీత కాలంలో చెల్లించడానికి ఆఫర్ ను కూడా  ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.
ఇకపోతే ఫ్లిప్ కార్ట్ ప్రవేశపెట్టిన పే లేటర్ అనే ఆఫర్ కొత్తదేమీ కాదు.. గతంలో కూడా ఉన్నదే.. కానీ క్రెడిట్ కార్డు లిమిట్ అప్పట్లో కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఉండేది.. ముఖ్యంగా ఫ్లిప్ కార్ట్ కస్టమర్ ల కోసం ప్రవేశపెట్టిన పే లెటర్ అనే ఆప్షన్ ద్వారా కేవలం గరిష్టంగా 10 వేల రూపాయల వరకు మాత్రమే షాపింగ్ చేసే వసతిని కల్పించింది.. కానీ ఇప్పుడు ఆ ఆఫర్ ను ఏకంగా 70 వేల రూపాయల వరకు పెంచి కస్టమర్లకు మరింత శుభవార్త ను తెచ్చింది.
ముఖ్యంగా కరోనా కాలంలో చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.. కాబట్టి అలాంటి వారి కోసమే షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించింది.కాబట్టి ఫ్లిప్ కార్ట్ పే లెటర్ అందిస్తున్న ఈ ఆఫర్ ను ఉపయోగించుకుని ,దసరా పండుగను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఫ్లిప్ కార్ట్ ఆశిస్తోంది. మీరు స్మార్ట్ టీవీ, రిఫ్రిజిరేటర్ ,స్మార్ట్ ఫోన్ వంటివి కూడా కొనుగోలు చేయవచ్చు.. ఇప్పటికే 10 కోట్ల మంది కస్టమర్లు ఫ్రీ అప్రూవ్డ్  క్రెడిట్ ను పొందుతున్నారు. ఇక మీరు కూడా పే లేటర్ అనే ఆప్షన్ ద్వారా ఫ్లిప్ కార్ట్ లో వస్తువులను సంతోషంగా కొనవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: