బుల్లి పిట్ట: ఫోన్ పే లో ఇలా చేస్తే బాదుడే.. బాదుడు..?
దేశంలోని ప్రజలు ఎక్కువగా ఇప్పుడు డిజిటల్ లావాదేవీలనే వినియోగిస్తున్నారు. ప్రధానంగా బిల్లు చెల్లింపు విషయంలో కోట్ల మంది ఎక్కువగా ఫోన్ పే యాప్ ని వినియోగిస్తున్నారు. పట్టణాల నుంచి గ్రామీణుల వరకు అందరూ ఎక్కువగా ఫోన్ పే ను వాడే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉండడం విశేషం. ఇక క్రెడిట్ కార్డు నుంచి ఫోన్ పే వాలెట్ కు డబ్బులను పంపించు కుంటూ ఉంటారు.
అయితే ఇలా చేయడం వల్ల, ట్రాన్స్ఫర్ చేసిన వారికి భారీ షాక్ తగలనుంది. క్రెడిట్ కార్డుల ద్వారా మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే..100 కీ 2.06 రూపాయల ఛార్జ్ చేయబడుతుంది అన్నట్లుగా సమాచారం. ఇక ఎంత మనీ యాడ్ చేసుకుంటే అంత ఎక్కువ .. ఛార్జీలు సైతం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక ఫోన్ పే వాడే యూజర్లకు.. ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.
ఈ ఛార్జీలు సైతం అడిషనల్ కన్వీనియన్స్.. ఫీజు కింద ఈ మనీని మొత్తం వినియోగదారుల నుంచి తీసుకుంటోంది. ఎవరైతే క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ పే వాలెట్ లోకి మనీ ని యాడ్ చేసుకుంటారో.. వారికి మాత్రమే ఈ అదనపు చార్జీలు వర్తిస్తాయి. అలాకాకుండా డెబిట్ కార్డ్, ఇతర ట్రాన్సాక్షన్ ద్వారా మనీ ని యాడ్ చేసుకుంటే.. ఎటువంటి చార్జీలు చెల్లించవలసిన పని ఉండదు.