బుల్లి పిట్ట: ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అప్పటి నుంచే ప్రారంభం..!

Divya
ఫ్లిప్ కార్ట్ కు సంబంధించి 2021 సంవత్సరానికి గాను బిగ్ బిలియన్ డేస్ మరొకసారి నిర్వహించనుంది. గత మాసంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సేవలను ప్రారంభించింది ఫ్లిప్ కార్ట్. అయితే ఇప్పుడు మరొకసారి ఈ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈసారి వరుస పండుగల నేపథ్యంలో ఈ సేల్ ను నిర్వహించనుంది.
ఫ్లిప్ కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేస్  సేల్స్ ను సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం చేయనుంది.. ఆ తర్వాత ఈ సేల్స్ ను అక్టోబర్ 1 వ తారీకు వరకు ఉంచనుంది. ఈ సేల్  లో సరికొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నారు ఫ్లిప్ కార్ట్ సంస్థ వారు. అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ లపై కూడా భారీగా డిస్కౌంట్ ను ప్రకటించనున్నారు.

ఇక ఇందులో భాగంగా సరికొత్తగా 6 కొత్త స్మార్ట్ బ్రాండ్ మొబైల్స్ ను విడుదల చేయనున్నారు.వాటిలో ముఖ్యంగా.. ఒప్పో, పోకో, మోటరోలా, సాంసంగ్, రియల్ మీ, వివో.. వంటి సంస్థలు ఈ సేల్ లో పాల్గొనబోతున్నాయి. ఇక రియల్ మీ కి సంబంధించి.. నార్జో50 సిరీస్ సంబంధించి మొబైల్ ను సెప్టెంబర్ 24న విడుదల చేస్తున్నారు.

ఒప్పో నుంచి సెప్టెంబర్ 27న సరికొత్త మొబైల్ ను విడుదల చేయనుంది. ఇక ఇదే తరుణంలో సాంసంగ్ కూడా సరికొత్త స్మార్ట్ ఫోన్..M 525 genee అనే మొబైల్ ని సెప్టెంబర్ 28న విడుదల చేయనుంది. ఇక పోకో, వివో బ్రాండ్ కు సంబంధించి మొబైల్స్ సెప్టెంబర్ 30న విడుదల కానున్నాయి. అక్టోబర్ 1న మాత్రం మోటరోలా ఫోన్ కి సంబంధించి ఒక సరికొత్త మొబైల్ ను విడుదల చేయనుంది.
ఇక అంతే కాకుండా ఒప్పో..A55 మొబైల్ ను విడుదల చేయనుంది. ఇక అందుకుగాను బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ను  ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: