సేవ్ చేసుకోని నెంబర్ కి ఇలా వాట్సాప్ మెసేజ్ చెయ్యొచ్చు..

వాట్సాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ప్రపంచంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి. ఇక ఈ రోజుల్లో వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్లు ఏమి లేవనే చెప్పాలి. కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్ల రాకతో మాములు మొబైల్‌ టెక్స్ట్ మెసేజ్‌లకు గుడ్ బై చెప్పి పలు రకాల యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌లను చేస్తుంటాం. వాట్సాప్‌ మనందరి జీవితాల్లో కూడా ఒక ప్రత్యేకమైన భాగమైంది. పొద్దున లేవగానే ముందుగా చేసే పని. ఫోన్ తీసుకొని అందులో డేటా ఆన్‌ చేసి వాట్సాప్‌లో ఏమైనా మెసేజ్‌స్‌ వచ్చాయో లేదో చూస్తాం.ఇక వాట్సాప్‌లో ఒకరికి మెసేజ్‌ చేయాలంటే తప్పకుండా ఆ వ్యక్తి నంబర్‌ను సేవ్‌ చేసుకోవాలి. సేవ్‌ చేస్తేనే వాట్సాప్‌ యాప్‌లో ఆ వ్యక్తి యొక్క నంబరు మనకు కన్పిస్తోంది.ఇక థర్డ్‌పార్టీ యాప్స్‌ ఉపయోగించి ఆ వ్యక్తి యొక్క నంబర్‌ను సేవ్‌ చేసుకోకుండానే వాట్సాప్‌లో ఈజీగా మెసేజ్‌ చేయవచ్చు. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఉపయోగించి మెసేజ్‌ చేయడం అంత మంచిది కాదనే చెప్పాలి. అది మన భద్రతకే భంగం కలుగుతుంది.ఇక అంతేకాకుండా అది మనల్ని ప్రమాదంలోకి నెట్టే అవకాశం కూడా ఉంది.అందుకే ఇలాంటి సమస్య లేకుండా వాట్సాప్‌లో నంబర్ లేకుండా మెసేజ్ ఎలా పంపాలో లేదా కాంటాక్ట్ యాడ్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

ఇక మీ స్మార్ట్ ఫోన్‌లోని బ్రౌజర్‌ని(క్రోమ్‌ లేదా ఫైర్‌ఫాక్స్‌) ఒపెన్‌ చేయండి. ఇప్పుడు మీరు  https://wa.me/xxxxxxxxxx ఈ లింక్‌ని కాపీ చేసుకోని యూఆర్‌ఎల్‌ అడ్రస్‌ బార్‌లో దీన్ని పేస్ట్‌ చేయాలి. ఇక ఇక్కడ xxxxxxxxxx స్థానంలో  మన దేశ కంట్రీ కోడ్‌ 91తో పాటు  మీరు మెసేజ్‌ చెయ్యాలనుకున్న మొబైల్‌ నంబర్‌ను టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక ఉదాహరణకి మీ వాట్సాప్‌లో సేవ్‌ కాని ఒక నంబర్‌కు ‘https://wa.me/919911111111’ను ఎంటర్‌ చేయాలి. ఇక ఇక్కడ ముందు రెండు అంకెలు మన దేశ కోడ్‌. ఆ తరువాత మెసేజ్‌ చెయ్యాలనుకున్న వ్యక్తి మొబైల్ నంబర్ టైప్ చెయ్యండి.ఇక మీరు ఆ లింక్‌ను ఎంటర్ చేసిన తర్వాత ఆ లింక్‌ని తెరవడానికి ఎంటర్ నొక్కండి .ఇక తరువాత మీరు రెసిపెంట్‌(గ్రహీత) మొబైల్ నంబర్‌తో గ్రీన్‌ కలర్‌తో మెసేజ్‌ బటన్‌తో ఒక వాట్సాప్‌ పేజీని చూడటం జరుగుతుంది. ఇక గ్రీన్‌ కలర్‌ మెసేజ్‌ బటన్‌పైన కనుక క్లిక్‌ చేస్తే మీరు వాట్సాప్‌కు మళ్ళీ కూడా మళ్లించబడతారు.ఇక అంతే మీరు ఒక నంబర్‌ను సేవ్‌ చేసుకోకుండా ఈ విధంగా వాట్సాప్ మెసేజ్‌ ను చేయవచ్చును. ఒకసారి ట్రై చేసి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: