జియో బంపర్ ఆఫర్... 75 జీబీ డేటాతో పాటు ఇవి ఫ్రీ

Vimalatha
జియో వినియోగదారుల కోసం మంచి ప్లాన్లను, ఆఫర్లను తీసుకొస్తూనే ఉంది. తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందించే టెలికామ్ సంస్థల విషయానికొస్తే.... జియో ముందు వరుసలో ఉంటుంది. ప్రీపెయిడ్ మాత్రమే కాకుండా పోస్ట్‌పెయిడ్ కోసం కూడా జియో అద్భుతమైన ప్లాన్‌లను అందిస్తోంది. ఈ రోజు జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లాన్ ధర తక్కువ, కానీ ప్రయోజనాలు సూపర్. ఇందులో మీరు 75 జీబీ డేటాతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ వస్తోంద. ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం ...
జియో రూ .399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
జియో రూ . 399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 75 జీబీ డేటా ఒక నెల పాటు అందుబాటులో ఉంటుంది. ఇందులో రోజుకు ఇంత అని లిమిట్ ఏం లేదు. నెలలో ఏ రోజైనా కావాల్సినంత డేటాను ఉపయోగించవచ్చు. డేటా సేవ్ చేయబడినప్పటికీ, ఈ ప్లాన్‌లో జియో 200 జీబీ వరకు డేటా రోల్‌ఓవర్ సదుపాయాన్ని అందిస్తుంది. డేటా అయిపోయిపోతే కంపెనీ 1 జీబీ డేటా కోసం రూ. 10 ఛార్జ్ చేస్తుంది.  
ఈ ప్లాన్ ప్రయోజనాల విషయానికొస్తే... అపరిమిత కాలింగ్‌తో పాటు ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. ఓటిటి కంటెంట్ కావాలనుకుంటే ఈ ప్లాన్ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్‌తో మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్‌లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు. జియో యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.
జియో రూ .399 ప్రీపెయిడ్ ప్లాన్
జియో కి రూ .399 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. దీని వాలిడిటీ 56 రోజులు, దీనిలో రోజూ 1.5 జీబీ డేటా ఇస్తారు. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను కూడా అందిస్తుంది. అంతే కాకుండా జియో యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: