బుల్లి పిట్ట: అదిరిపోయే ఆఫర్లతో ఐఫోన్ 12 సీరీస్..!
ఇక కొత్త సిరీస్ ఐఫోన్ 13 లాంచ్ చేసిన తర్వాత ఐఫోన్ 12 సిరీస్ పై ధరలు తగ్గించడంతో , కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్ అలాగే ఫ్లిప్ కార్ట్ లో పలు ఆఫర్లు ప్రకటించడం గమనార్హం.. ఇక ఈ ఐఫోన్ 12 సిరీస్ పై కస్టమర్లను ఆకర్షించడానికి అమెజాన్ తోపాటు ఫ్లిప్కార్ట్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ లను కూడా ప్రకటించాయి.. అంటే ఒకవేళ ఫ్లిప్ కార్ట్ లేదా అమెజాన్ లో ఐ ఫోన్ 12 స్మార్ట్ ఫోన్ ( వనిల్లా) ధర ప్రస్తుతం రూ. 63,999 కి కొనుగోలు చేయవచ్చు. 64 జిబి వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ గతేడాది రూ.79,900 ఉండగా , ఇప్పుడు రూ. 15,901 రూపాయలు డిస్కౌంట్ తో మనకు రూ.63,999 కే లభించనుంది..
ఇక ఇదే మొబైల్ 128 జీబీ వేరియంట్ తో గతేడాది రూ.84,900 ఉండగా , ప్రస్తుతం దీనిని రూ.68,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ పైన కూడా మనం 15,901 రూపాయలను ఆదా చేసుకోవచ్చు అన్నమాట.
256 జీబీ వేరియంట్ తో వచ్చిన ఈ మొబైల్ ప్రస్తుతం రూ.78,999 కే లభించనుంది. అంతేకాదు గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎక్స్చేంజ్ లో భాగంగా 14,200 రూపాయలను అమెజాన్ అందిస్తుంటే ,15 వేల రూపాయలను ఫ్లిప్ కార్డ్ ఎక్స్చేంజ్ కింద తగ్గిస్తుంది.