ఇక ఫోర్డ్ .. భారత్ వీడినట్టేనా .. !

ఫోర్డ్ భారత్ ను విడినట్టే అని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ చెల్లించాల్సిన పరిహారంపై దేశీ డీలర్ల సమాఖ్య స్పష్టతను కోరింది. కరోనా కారణంగా ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాల కొనుగోలు లేకపోవటంతో చాలా వరకు ఉత్పత్తిని నిలిపివేశాయి. దీనితో ఆయా సంస్థలు తమ తమ సొంత గూటికి చేరుతున్నాయి. ఫోర్డ్ కూడా అమెరికా చేరేందుకు పూర్తిగా సిద్దమైనది. అయితే డీలర్లు తమ తమ డిమాండ్లను సదరు సంస్థకు తెలిపారు. దీనితో ఫోర్డ్ భారత్ ఎండి అనురాగ్ మెహతా కు ఈ మేరకు డీలర్ల సమాఖ్య లేఖ రాసింది. ఫోర్డ్ తన ప్లాంట్ మూసేస్తుందన్న విషయం తెలియడంతో కొనిగోలుదారులు తమ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారని వారు తెలిపారు.
ఇది ఇలా కొనసాగితే డీలర్లు నష్టయిపోయే స్థితి ఉందని వారు సంస్థకు లేఖ ద్వారా తెలియపరిచారు. ప్రస్తుతం ఇటీవలే డీలర్ షిప్ తీసుకున్న వారు ఈ జాబితాలో ఉన్నారని సమాఖ్య తెలియజేసింది. వీరందరూ భారీగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సంస్థ పరిహారం గురించి ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే దానిని తమకు తెలియజేయాలని వారు సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ వీలైనంత సామరస్యంగా జరిగే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. సంస్థ డీలర్లకు పంపిన నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ లో పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయని సమాఖ్య వెల్లడించింది.
ఇవన్నీ సవరించి, తగిన విధంగా సంస్థ స్పష్టత ఇవ్వాలని సమాఖ్య తెలిపింది. ప్రస్తుతానికి భారత్ లో ఉన్న రెండు ప్లాంట్ల లోను ఉత్పత్తి ఆగిపోయిందని సంస్థ తెలిపింది. ఇకపై కేవలం దిగుమతి చేసిన వాహనాలు మాత్రమే ఫోర్డ్ విక్రయిస్తుంది అని సంస్థ గతవారమే తెలిపింది. దీనితో సంస్థలో పనిచేస్తున్న 4 వేలమంది ఉద్యోగులు, 300 పైగా అవుట్ లెట్స్ లలో 150 మంది డీలర్స్ పై ప్రభావం ఉంటుందని తెలిపారు. సంస్థ పదేళ్లలో భారత్ మార్కెట్లో దాదాపు 2 బిలియన్ డాలర్ల నష్టాలు వచ్చినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: