బుల్లి పిట్ట : జియో నుంచి సరికొత్త ల్యాప్ టాప్స్..అతి తక్కువ ధరకే..!

Divya
జియో నుంచి ఇప్పటివరకు అతి తక్కువ ధరలకే మొబైల్ రీఛార్జ్ అందించిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య కాలంలోనే జియో స్మార్ట్ ఫోన్ కూడా అతి తక్కువ ధరకే విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు కూడా మరొక సంచలనాన్ని సృష్టించడానికి సిద్ధమైంది జియో. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

జియో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తో పాటుగా.. జియో బుక్ లాప్ టాప్ ను విడుదల చేయనున్నట్లు  ప్రకటిస్తోంది. ఈ బుక్ ను భారతదేశంలో కొద్దిరోజుల్లోనే లాంచ్ చేయనున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించి BIAS-అనే వెబ్సైట్ సర్టిఫికెట్ కోసం జియో బుక్ ల్యాప్ ట్యాప్ ను వుంచినట్లుగా సమాచారం. ఈ ల్యాప్ ట్యాప్ మూడు వేరియంట్లలో లభించనున్నట్లు గా BIAS వెబ్ సైట్ తెలిపింది.
ఇక ఇందుకు సంబంధించి విడుదల తేదీ ని కన్ఫామ్ చేయలేదు జియో. ఇక ఇది 4 జి ఎల్ టి ఈ కనెక్టివిటీ తో లభించనున్నట్లు సమాచారం. ఇది 4GB ram  తో పాటు 64 GB మెమొరీ సామర్థ్యం తో మనకి లభించనుంది. ఇది మూడు వేరియంట్లలో..NB1148QMW,NB1118QMW,NB1112MM.. అనే మూడు విధాలుగా లభించనున్నట్లు గా BIAS వెబ్ సైట్ ముఖుల్ శర్మ తెలియజేశారు.
ఇక ఈ ల్యాప్ ట్యాప్  యొక్క స్పెసిఫికేషన్ విషయానికొస్తే..
1). 4GB RAM+64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు.
2). మినీ హెచ్డీ ఎమ్ఐ కనెక్టివిటీ కలదు.
3). ఇక ఈ ల్యాప్ ట్యాప్ యొక్క డిస్ప్లే విషయానికి వస్తే..(1366X786)
4). స్నాప్ డ్రాగన్ ఎస్ ఓసి..664 ప్రాసెస్ ను కలిగి ఉంటుంది.
5). ఇక ఇందులో ముఖ్యంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై ను ఉపయోగించుకోవచ్చు.
6). ఇక జియో కు సంబంధించి ఎటువంటి యాప్ నైన ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
7). బ్లూటూత్ సపోర్టుతో ఇది మనకి అందించనుంది.
అయితే దీని ధర అతి తక్కువ ధరకే మనకి లభించ నున్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: