క‌రోనా ఫోక‌స్ : వెలుతురు ఉంటే క‌రోనా రాదు !

RATNA KISHORE

రెండున్న‌రేళ్లుగా క‌రోనా ప్ర‌పంచాన్ని ప‌ట్టి పీడిస్తున్నందున వ్యాధిపై ఇంకొంత అవ‌గాహ‌న కానీ అధ్య‌య‌నం కానీ  ప్ర‌జ‌ల‌కు అవ‌స రం. ముఖ్యంగా బ‌హిరంగ ప్రాంతాల్లో ర‌క్ష‌ణ చ‌ర్య‌లు పాటించ‌డం అన్న‌ది ప్ర‌ధాన విష‌యం. వైర‌స్ వ్యాప్తి ప్ర‌స్తుతం త‌గ్గినా, అజాగ్ర‌త్త వ‌ద్ద‌ని హెచ్చ‌రిస్తున్నాయి ప‌రిశోధ‌న సంస్థ‌లు. ముఖ్యంగా కొత్త వేరియంట్ రాక అంటే ఇప్పుడున్న వేరియంట్ క‌న్నా తీవ్ర‌మైంది వ‌స్తేనే అది మూడో ద‌శ‌కు సంకేతం అని సీసీఎంబీ చెబుతోంది. రాష్ట్రంలో బ‌డులు తెరుచుకున్న నేప‌థ్యంలో అనేక భ‌యాలు ము ప్పిరిగొ న్నాయి క‌నుక వీటిపై సంబంధిత ప‌రిశోధ‌కులు మాట‌లు జాగ్ర‌త్త‌గా వినాలి.  పాటించాలి. ఆ దిశగా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీ సుకోవాలి. వెలుతురు ధారాళంగా ఉన్న గ‌దుల్లోనే చ‌దువులు చెప్పించాలి. ఏదేమైన‌ప్ప‌టికీ వైర‌స్ ఉద్ధృతి, వ్యాప్తి అన్న‌వి పరీక్ష‌లు మాత్ర మే నిర్ణ‌యిస్తాయి. ప‌రిశోధ‌న ఫ‌లితాల ఆధారంగానే కొత్త వేరియంట్ల గుర్తింపు సాధ్యం. ఈ నేప‌థ్యంలో క‌రోనా కు సంబంధించి చేప ట్టే ప‌రీక్ష‌ల‌కు ఓ కొత్త స్థావ‌రం దొర‌క‌నుంది. విజ‌య‌వాడ‌లో ఏర్పాట‌య్యే జీనోమ్ సీక్వె న్సింగ్ స‌ర్వైవలెన్స్ కేంద్రం ఇందుకు వే దిక‌. ఈ కేంద్రంలో చేసే ప‌రీక్ష‌లు కార‌ణంగా వైర‌స్ జ‌న్యు క్ర‌మాన్ని గుర్తించేందుకు వీలుంటుంద‌ని సీసీఎంబీ చెబుతోంది. అదేవిధం గా కొ త్త వేరియంట్ల గుర్తింపున‌కు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌వ‌చ్చ‌ని ఆ సంస్థ వెల్ల‌డిస్తోంది.
ఇంకా చెప్పాలంటే..:
క‌రోనా రాక కార‌ణంగా బ‌డులు మూత ప‌డ్డాయి. త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇప్పుడిప్పుడే చ‌దువులు మొద‌ల‌య్యాయి. బ‌డులు ప్రా రంభం అయ్యాయి..బ‌డి గంట‌లు మోగుతున్న వేళ చిన్నారుల‌కు సంద‌డి..త‌ల్లిదండ్రుల‌కు ఆందోళ‌న. ఇదే సంద‌ర్భంలో జాగ్ర‌త్త లు పాటిస్తే క‌రోనా సోక‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఏపీ స‌ర్కారు ఈ విష‌య‌మై మ‌రింత దృష్టి సారిస్తే బ‌డుల నిర్వ‌హ‌ణ అన్న‌ది సులువే! ముఖ్యంగా బ‌డి పిల్ల‌ల ఆరోగ్యంపై దృష్టి సారించాల‌ని సీసీఎంబీ కోరుతోంది. ధారాళంగా వెలుతురు ఉన్న త‌ర‌గ‌తి గదుల లో బోధ‌న కార‌ణంగా జ‌ర్మ‌నీలో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని తెలిపింది. ఇదే విధానం అన్ని చోట్లా పాటించాల‌ని సూచించింది. సెంటర్ ఫ‌ర్ సె ల్యుల‌ర్ అండ్ మాలుక్యుల‌ర్ బ‌యోల‌జీ (సీసీఎంబీ) ఆధ్వ‌ర్యాన క‌రోనా పై చేసిన ప్ర‌యోగ ఫ‌లితాలు ఆధారంగా ఆ సంస్థ డైరెక్ట‌ర్ కొ న్ని సూచ‌న‌లు చేశారు. క‌రోనా మొద‌లై రెండేళ్లు కావ‌స్తోంది, వైర‌స్ బ‌ల‌హీన ప‌డుతోంది..అని డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎన్‌. నందికూరి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: