ఇంటర్నెట్ లేకున్నా డెబిట్ కార్డు యూజ్ చెయ్యొచ్చు.

ప్రస్తుతం డెబిట్‌ కార్డులు కానీ క్రెడిట్‌ కార్డులు కానీ స్వైపింగ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ అనేది తప్పనిసరిగా కావాలి. నెట్‌ వర్క్‌ అనేది సరిగ్గా ఉంటేనే డెబిట్‌కార్డు ద్వారా ట్రాన్సక్షన్స్ పూర్తి చేసుకోవచ్చు. మనం అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలంటే డెబిట్ కార్డు మెషీన్లో ఇంటర్నెట్ అనేది తప్పనిసరి అవసరం. ఒకవేళ మన ప్రాంతంలో ఇంటర్నెట్ సరిగ్గా లేకపోతే ఆ సమయాల్లో మనం అనేక ఇబ్బందులను పడాల్సి వస్తుంది. ఇక అలాంటి సమయంలో కార్డును వాడటం అసలు వీలు కాదు. ఇక అలాంటి సమస్యలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి రానుంది. ఈ టెక్నాలజీ ద్వారా మనం ఉన్న ప్రాంతంలోనే డెబిట్ కార్డు ద్వారా ట్రాన్సక్షన్స్ జరిపే అవకాశం ఉంటుంది. ఈ  దిశగా వీసా కంపెనీ కూడా పనిచేస్తుంది. అలాగే మనకు అందించే చిప్  వీసా డెబిట్ కార్డుతో ఇంటర్నెట్ లేకున్నా సరే ప్రతి రోజు కూడా రూ.2 వేల వరకు ట్రాన్సక్షన్స్ అనేవి ఈజీగా జరపవచ్చు.

ఇక ఇప్పటికే పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఇన్నోవిటి భాగస్వామ్యంతో వీసా ఆఫ్‌లైన్‌ చెల్లింపుల కోసం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్(పీఓసీ) పద్దతిలో ఒక డెబిట్ కార్డుని రూపొందించడం జరిగింది. ఇక ఈ పీఓసీ కార్డును యస్ బ్యాంక్‌ ఇంకా యాక్సిస్ బ్యాంక్ మార్కెట్లోకి తీసుకొని రావడానికి అనేక ప్రయత్నాలని చేస్తున్నాయి. ఇక ఈ ప్రీపెయిడ్ కార్డులనేవి ఇతర వాటి కంటే కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి నెట్‌వర్క్‌ క్లౌడ్ ద్వారా పనిచేస్తాయి.ఇక ఈ కొత్త వీసా చిప్ డెబిట్ కార్డులో రోజువారీ ఖర్చు లిమిట్ అనేది రూ.2 వేలు. ప్రతి ట్రాన్సక్షన్స్ లిమిట్ అనేది కూడా రూ.200 మాత్రమే అని ఆర్‌బీఐ వెల్లడించడం జరిగింది. ఒకవేళ తగిన బ్యాలెన్స్ కనుక లేకపోతే లావాదేవీని తిరస్కరించడం జరుగుతుంది.ఇక వీసా ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని మొట్టమొదటి సారిగా మనదేశంలో కూడా ప్రారంభించడానికి రెడీగా ఉంది. అయితే ఎక్కువ శాతం డిజిటల్ ట్రాన్సక్షన్స్ ఇంటర్నెట్ లేని కారణంగా ఫెయిల్ అవుతున్నట్లు గతంలో ఆర్‌బీఐ తెలిపడం జరిగింది. ఇక ఆ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త టెక్నాలజీ వీసా తీసుకోని రావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: