జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కొత్త ప్లాన్లు... ఇవన్నీ ఫ్రీ !

Vimalatha
రిలయన్స్ జియో తన జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో భారీ అప్‌గ్రేడ్ ప్రకటించింది. జియో ఇప్పటికే ఏడు 6 నెలల జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను, ఏడు వార్షిక జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది. మొట్టమొదటిసారిగా రిలయన్స్ జియో భారతదేశంలో వినియోగదారుల కోసం జియో ఫైబర్ మూడు నెలల పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం.
ప్లాన్‌లో జీఎస్టీ వర్తించదు
ఈ ప్లాన్‌లు రూ. 2097 నుంచి ప్రారంభమై రూ. 25,497 వరకు ఉంటాయి. రిలయన్స్ జియో ఈ మూడు నెలల పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లన్నీ జిఎస్‌టి లేకుండా వస్తాయని, ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఏవీ ఉండవని, 1 జిబిపిఎస్ వరకు ఇంటర్నెట్ వేగంతో వస్తాయని తెలిపింది.
జియో ఫైబర్ త్రైమాసిక ప్లాన్ రూ. 2097
జియో ఫైబర్ యొక్క ఈ ప్లాన్‌లో 100 ఎంబిపిఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యం ఉంది. ఇది మూడు నెలల చెల్లుబాటుతో వస్తుంది.
జియో ఫైబర్ త్రైమాసిక ప్లాన్ రూ .2,997
జియో ఫైబర్ యొక్క ఈ ప్లాన్‌లో 150 ఎంబిపిఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యం ఉంది. ఇది మూడు నెలల చెల్లుబాటుతో వస్తుంది. ఇది   amazon Prime Video, Disney+ Hotstar, SonyLIV, Zee5, Voot Select, Lionsgate Play, Eros Now, ALTBalaji మరియు JioSaav తో సహా ఇతర ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లను కూడా అందిస్తుంది.
జియో ఫైబర్ త్రైమాసిక ప్లాన్ రూ .4,497
జియో ఫైబర్ ఈ ప్లాన్ మూడు నెలల చెల్లుబాటుతో వస్తుంది. ఇది 300 ఎంబిపిఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇది amazon Prime Video, Netflix, Disney+ Hotstar, SonyLIV, Zee5, Voot Select, Lionsgate Play, Eros Now, ALTBalaji,  JioSaav లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.
జియో ఫైబర్ త్రైమాసిక ప్లాన్ రూ .7,497
జియో ఫైబర్ యొక్క ఈ ప్లాన్ మూడు నెలల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఇది 500 ఎంబిపిఎస్ వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇది amazon Prime Video, Netflix, Disney+ Hotstar, SonyLIV, Zee5, Voot Select, Lionsgate Play, Eros Now, ALTBalaji, JioSaav లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.
జియో ఫైబర్ త్రైమాసిక ప్లాన్ రూ .11,997
జియో ఫైబర్ యొక్క ఈ ప్లాన్ మూడు నెలల చెల్లుబాటుతో వస్తుంది మరియు ఇది 1Gbps వేగంతో అపరిమిత డేటా, ఉచిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. ఇది amazon Prime Video, Netflix, Disney+ Hotstar, SonyLIV, Zee5, Voot Select, Lionsgate Play, Eros Now, ALTBalaji, JioSaav లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.
జియో ఫైబర్ త్రైమాసిక ప్లాన్ రూ. 25,497
జియో ఫైబర్ యొక్క ఈ ప్లాన్‌లో, ప్రతి నెల 6600 జిబి డేటా, 1 జిబిపిఎస్ వేగంతో ఉచిత వాయిస్ కాల్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది amazon Prime Video, Netflix, Disney+ Hotstar, SonyLIV, Zee5, Voot Select, Lionsgate Play, Eros Now, ALTBalaji, JioSaav లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: