ఓలోలె .. ఓలా .. వచ్చేసే ..

ఓలా సంస్థ తాజాగా విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో నిమగ్నమైంది. కాలుష్య నివారణ లో భాగంగా ప్రభుత్వాలు కూడా ఈ తరహా వాహనాల ఉత్పత్తి, వినియోగాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి. దానితో ఇప్పటి వరకు పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు రూపొందించిన సంస్థలు కూడా ఈ తరహా వాహనాల ఉత్పత్తి వైపు మళ్లుతున్నాయి. వచ్చే తరం అంతా బహుశా ఇవే వాహనాలు ఉండవచ్చు. దాదాపు ఆయిల్ ఇంధనంగా ఉన్నవి కనుమరుగైపోవచ్చు, కారణం పెద్దగా చెప్పాల్సిన పనిలేదనుకుంటాను. ఇప్పటికే మొత్తం ఆయిల్ నిల్వలు వాహనాలు తాగేశాయి, దీనితో మరో ఇంధన వాహనం తయారీ అవసరం పడింది, అదే ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న విద్యుత్ వాహనాలు.
ప్రభుత్వం కూడా ఈ వాహనాలు వాడుతుండటం ద్వారా సాధారణ ప్రజలలో వీటిపై ఆసక్తి పెంచుతుంది. అలాగే ఉత్పాదక సంస్థలకు మరియు వీటిని కొనే వినియోగదారులకు అనేక రాయితీలు కూడా ఇస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. దీనితో వీటి ఉత్పత్తి, వాడకం కూడా రానురాను పెరుగుతూ వస్తుంది. మరీ అంత త్వరగా మనవాళ్ళు ఈ వాహనాల వాడకం వైపు అడుగులు వేయడం జరగకపోవచ్చు కానీ, ఖచ్చితంగా రేపటి వాహనాలు ఇవే అనేది స్పష్టం. ఓలా కూడా ఈ తరహా స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించింది. రేపటి నుండే ఈ వాహనాలను సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా కనీస రుసుము చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవాల్సి ఉంది.
ఆయా ఆర్థిక సంస్థల ద్వారా ఈఎంఐ సౌలభ్యం కూడా పొందవచ్చు. వివిధ బ్యాంకులతో ఇప్పటికే ఓలా సంస్థ ఒప్పందం చేసుకుంది. అందరికి అందుబాటులో ఉండేలా సులభవాయిదాల ధరను 2,999రూపాయలుగా నిర్ణయించినట్టుగా సంస్థ ప్రకటించింది. రేపటి నుండి కొనుగోలు చేసిన వారికి వచ్చే నెల నుండే డెలివరీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. షో రూమ్ తరహా లేకుండా ఆర్డర్ చేసిన వినియోగదారుల ఇంటికే వాహనాన్ని పంపేలా సంస్థ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే లక్ష ప్రీ బుకింగ్ ఉన్నట్టు సంస్థ ప్రకటించింది.
ఓలా కు తమిళనాడులో అతిపెద్ద ఉత్పాదక సంస్థ ఉంది. తద్వారా బుక్ చేసుకున్న వారికి నిర్ణీత గడువులోగా డెలివరీ ఇచ్చేందుకు సంస్థ తీవ్రంగా కృషిచేస్తుంది. ఈ స్కూటర్ లలో ఎస్ 1, ఎస్ 1 ప్రో అనే రెండు వేరియంట్లు దాదాపు పది రంగులలో లభిస్తున్నాయి. వీటిలో 8.5 కివాట్ మోటార్, 3.9 కివాట్ బ్యాటరీ ఏర్పాటు చేయబడ్డాయి. గరిష్ట వేగం 90-115కిమీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120-180కిమీ వరకు ప్రయాణించవచ్చు. కేవలం 3 సెకండ్లలో 40కిమీ వేగాన్ని అందుకోగలదు. వీటి ధరలు 99,999 రూపాయలు, 1,29,990 రూపాయలుగా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: