పెరిగిన రియల్ మీ స్మార్ట్ ఫోన్ల ధరలు..

మీరు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ ని కొనాలని భావిస్తున్నారా?అయితే మీరు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువ పే చెయ్యాలి. ఎందుకంటే ఇక రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల  ధరలు పెరిగడం జరిగింది. ఇటీవల షావోమీ కంపెనీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగిన విషయం అందరికి తెలిసిందే.అందువల్ల రెడ్‌మీ నోట్ 10 ధరను పెంచడం జరిగింది. ఇక ఇప్పుడు రియల్‌మీ బ్రాండ్ కూడా అదే దారిలో నడుస్తోంది.ఇప్పుడు ఏకంగా రియల్ మీ 5 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచడం జరిగింది. రియల్‌మీ 8 ఇంకా రియల్‌మీ 8 5జీ మరియు రియల్‌మీ సీ11 2021 అలాగే రియల్‌మీ సీ21 ఇంకా రియల్‌మీ సీ25ఎస్ మోడల్స్ ధరల్ని కంపెనీ పెంచడం జరిగింది. ఈ ఫోన్లపై ఏకంగా రూ.300 నుంచి రూ.1,500 మధ్య ధర ఇప్పుడు పెరిగింది.ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో కొత్త ధరలు అనేవి కనిపిస్తున్నాయి. మరి ఏఏ స్మార్ట్ ఫోన్లపై ఎంత ధర పెరిగిందో ఇప్పుడు తెలుసుకోండి.

ఇక రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే..4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.14,499 గా ఉండేది.ఇక ప్రస్తుత ధర వచ్చేసి రూ.15,999 గా వుంది. ఇక ఇదే స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.15,499 గా ఉండేది. దీని ప్రస్తుత ధర వచ్చేసి ఇప్పుడు రూ.16,999 గా వుంది. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర వచ్చేసి గతంలో రూ.16,499 గా ఉండేది.ఇక ప్రస్తుత ధర వచ్చేసి ఇప్పుడు రూ.17,999 గా వుంది. ఈ మూడు మోడల్స్‌పై కూడా ఏకంగా రూ.1,500 ధరను పెంచడం జరిగింది రియల్‌మీ కంపెనీ.

రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే..4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.13,999 ఉండగా దీని ప్రస్తుత ధర వచ్చేసి రూ.15,499 గా వుంది. ఇక రియల్‌మీ 8 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.14,999 ఉండగా ఇప్పుడు దీని ప్రస్తుత ధర వచ్చేసి రూ.16,499 గా వుంది. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర వచ్చేసి గతంలో రూ.16,999 ఉండగా ఇప్పుడు దీని ప్రస్తుత ధర వచ్చేసి రూ.18,499 గా వుంది. ఇక ఈ మూడు మోడల్స్ పైనా కూడా రూ.1,500 ధర పెంచింది రియల్‌మీ కంపెనీ.

ఇక రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే..2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.6,999 ఉండగా ఇప్పుడు దీని ప్రస్తుత ధర వచ్చేసి రూ.7,299 గా వుంది. ఇక 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.8,499 ఉండగా ప్రస్తుతం ఈ ఫోన్ ధర వచ్చేసి రూ.8,799 గా వుంది. ఇక రియల్‌మీ సీ11 ధర వచ్చేసి ఇప్పుడు రూ.300 పెరిగింది.

రియల్‌మీ సీ21 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే..3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.8,499 గా ఉండగా ఇప్పుడు దీని ప్రస్తుత ధర వచ్చేసి రూ.8,999 గా వుంది.ఇక 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి గతంలో రూ.9,499 గా ఉండగా దీని ప్రస్తుత ధర వచ్చేసి ఇప్పుడు రూ.9,999 గా వుంది. ఇక రియల్‌మీ సీ21 ధర రూ.500 పెరిగడం జరిగింది.

రియల్‌మీ సీ25ఎస్ స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే..4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.10,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.10,999. ఇక 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.11,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.11,999. రియల్‌మీ సీ25 ధర రూ.500 పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: