టెలిగ్రామ్‌లో ఈ సరి‌కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా ...?

Suma Kallamadi
ప్రజెంట్ టైమ్స్‌లో మార్కెట్‌లో పోటీని తట్టుకుని నిలబడి కస్టమర్స్‌కు న్యూ ఫీచర్స్ అందించే యాప్స్‌కు మాత్రమే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఈ క్రమంలోనే యాప్ సంస్థలు వినూత్న ఫీచర్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’ కూడా కొత్త ఫీచర్స్ విడుదల చేస్తోంది. తాజాగా టెలిగ్రామ్ 8.0 బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ బీటా వర్షన్‌ను ఆండ్రాయిడ్, మ్యాక్ ఓఎస్ యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కమ్యూనికేషన్, చాట్‌లు, న్యూస్ ఫీడ్‌ల కోసం మరిన్ని నూతన ఆప్షన్ల అందించారు. అవేంటంటే.. టెలిగ్రామ్ చానల్స్.. ఈ ఆప్షన్ ద్వారా మెసెంజర్‌లో నెక్స్ట్ చాట్‌కు ఈజీగా వెళ్లొచ్చు. 

రీడ్ చేయకుండానే నెక్స్ట్ చాట్‌కు లేదా న్యూస్ చానల్‌కు వేగంగా వెళ్లడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇకపోతే ఒక చాట్‌లోని చివరి మెసేజ్ నుంచి నేరుగా మరొక చాట్‌లోకి వెళ్లేందుకు స్వైప్ అప్ చేస్తే సరిపోతుంది. ఫోల్డర్‌లో లేదా చాట్‌ల జనరల్ లిస్టులో సైతం పైకి స్వైప్ చేసి తదుపరి చానళ్లను ఈజీగా రీడ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ద్వారా మనం పంపే మెసేజ్ ద్వారా అవతల వ్యక్తికి మన పేరు ఈజీగా తెలిసిపోతుంది. కాగా, మనం పేరును దాచి కూడా మెసేజ్ పంపొచ్చు. తద్వారా అవతల వ్యక్తి మన ఐడెంటిటీని గుర్తు పట్టలేడు. ఇందుకుగాను ‘హైడ్ సెండర్స్ నేమ్’ అనే ఫీచర్ వాడాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయడానికిగాను సెలక్ట్ చేసుకున్న చాట్‌లో మెసేజ్‌పై క్లిక్ చేసి హైడ్ సెండర్స్ నేమ్‌ను సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టెలిగ్రామ్’ యాప్‌లో వాయిస్ చాట్ కూడా రికార్డు చేసుకోవచ్చు. పోర్ట్రెయిట్, ల్యాండ్‌స్కేప్ మోడ్‌లలో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇందుకుగాను మీరు వాయిస్ రికార్డ్ చేసే టైంలో వాయిస్ ఓన్లీ‌పై కాకుండా వీడియో రికార్డ్ పై క్లిక్ చేయాలి. టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ పంపంచే క్రమంలో మెసేజ్‌ను యానిమేట్ కూడా చేయొచ్చు. గ్రేడియంట్ పాలెట ఉపయోగించి మెసేజ్ పంపించేప్పుడు కలర్ చేంజ్ చేయొచ్చు. దాంతో పాటు చాట్ బబుల్ యానిమేషన్స్‌ను కూడా మార్చొచ్చు.  ఎమోజీ లేదా స్టిక్కర్స్‌కు బదులుగా అదే అర్థంతో వచ్చే గిఫ్ పిక్చర్స్ కూడా పంపించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: