మార్కెట్లో ట్రయంఫ్ నుంచి కొత్త బైక్.. వివరాలు..

ఇండియా మార్కెట్లో  ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కంపెనీ తన 2021 ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ బైక్ విడుదల చేయడం జరిగింది. ఇండియా మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2021 Triumph Speed Twin బైక్ ధర వచ్చేసి రూ. 10.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) వుంది. ఇక కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ బైక్ ని బుక్ చేసుకోని కొనవచ్చు.ఇక ఈ కొత్త 2021 Triumph Speed Twin బైక్ కొత్త బ్రేక్‌లు, సస్పెన్షన్ సెటప్, టైర్లు ఇంకా అలాగే అల్లాయ్ వీల్స్‌తో విడుదల చేయబడింది. ఇక అంతే కాకుండా ఇందులోని ఇంజిన్ కూడా బాగా అప్డేటెడ్ చేయబడింది. ఇక ఈ కొత్త బైక్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా అలాగే ఎంతో దృఢంగా ఉంటుంది.ఇక ఈ సరికొత్త Triumph Speed Twin  బైక్ మంచి పర్ఫామెన్స్ అందించే విధంగా తయారుచేయబడటం విశేషం. ఇక ఇందులో స్పెసిఫికేషన్, హ్యాండ్లింగ్ ఇంకా రైడ్ నాణ్యతను మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొనడం జరిగింది.

 ఇక ఈ బైక్ మంచి అధిక పనితీరు కలిగిన 1200 సిసి ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ Triumph Bonneville (ట్రయంఫ్ బోన్‌విల్లే) నుండి తీసుకోబడటం జరిగింది. కానీ ట్రయంఫ్ బోన్‌విల్లే కంటే కూడా ఇది ఎంతో మెరుగైన పనితీరుని అందిస్తుంది. కానీ ఈ కొత్త Triumph Speed Twin బైక్ డిజైన్ ఇంకా స్టైలింగ్ మాత్రం అలాగే ఉంది.ఇక ఈ కొత్త 2021 Triumph Speed Twin  పవర్ అవుట్‌పుట్ వచ్చేసి ఇంజిన్ 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 96 బిహెచ్‌పి పవర్ అలాగే 4,950 ఆర్‌పిఎమ్ వద్ద 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌కు మిక్స్ చేయబడి ఉంటుంది.ఇక ఈ ఇంజిన్ బోనెవిల్లే కంటే కూడా 17 శాతం ఎక్కువ పవర్ ని అందిస్తుంది.ఇక ఈ కొత్త బైక్ లోని సస్పెన్షన్‌ సెటప్ లో కొంత మార్పులు అనేవి చేయబడ్డాయి. ఈ బైక్ ముందు భాగంలో వచ్చేసి 43 మిమీ మార్జోచి ఫోర్క్‌లను 120 మిమీ ప్రయాణంతో వాడుతుంది.ఇక అదే సమయంలో.. ట్విన్ షాక్ అబ్జార్బర్‌లు వచ్చేసి 120 మిమీ ట్రావెల్‌తో బైక్ వెనుక భాగంలో అమర్చబడి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: