ఆధార్ లో ఈజీగా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడం ఎలా?

ఆధార్ కార్డు ఎంత అవసరమో తెలిసిన సంగతే. ఆధార్ లేకపోతే ఇప్పుడు ఇండియాలో మనిషికి ఏది నడవదు. చచ్చిన శవంతో సమానం.ఇక చాలా మంది ఆధార్ కార్డులో పుట్టిన తేదీ అనేది తప్పుగా ఉంటుంది. లేదా సంవత్సరం మాత్రమే ఉంటుంది. డేట్ ఉండదు. అలా అయితే చాలా సమస్యలు రావొచ్చు. ఒక బ్యాంక్ అకౌంట్ తెరవాలన్నా లేదా పాన్ కార్డు తీసుకోవాలన్నా అలాగే ప్రభుత్వ పథకాలు పొందాలన్నా డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోతే అనేక సమస్యలనేవి ఎదురవుతాయి.ఇక చాలా సులభంగా మీరు మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉంటే దానిని ఈజీగా సరిచేసుకోవచ్చు.ఇక పుట్టిన తేదీ తప్పుగా ఉందని మీరు గుర్తించిన వెంటనే దానిని మార్చడం చాలా మంచిది. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి మీరు కష్టపడి ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లోనే మీ పుట్టిన తేదీని చాలా ఈజీగా మార్చుకునే అవకాశం కల్పిస్తోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. మరి చాలా సులభంగా ఇంకా వేగంగా ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని ఎలా సరిచేసుకోవాలో తెలుసుకోండి.


ఆధార్ కార్డు వున్నవారు ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ అయినా https://ssup.uidai.gov.in/ssup/ వెబ్ సైట్ ని ఓపెన్ చేయాలి.తరువాత Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి. 
ఆ తరువాత 12 అంకెల ఆధార్ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేయాలి.తరువాత అక్కడ క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేయాలి.ఇక తరువాత Sent OTP పైన మీరు క్లిక్ కనుక చేస్తే మీ ఆధార్ నెంబర్‌కు రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్‌కు ఓటీపీ అనేది వస్తుంది.ఇక ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయాలి. ఇక అక్కడ మీ ఆధార్ వివరాలు అనేవి స్క్రీన్ పైన కనిపిస్తాయి. అందులో మీ పుట్టిన తేదీని మార్చాలి.తరువాత యూఐడీఐఏ సూచించిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాలి. ఇక ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి.ఇక మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ వివరాలను ఇంకా మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్‌ని బాగా పరిశీలించి యూఐడీఏఐ మీ పుట్టిన తేదీని కరెక్ట్ చేస్తుంది.


అలాగే మీ రిక్వెస్ట్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి ఇలా చెయ్యండి.ఇక https://ssup.uidai.gov.in/ssup/ వెబ్‌సైట్ ని ఓపెన్ చేయండి.తరువాత Check Update Status పైన క్లిక్ చేయండి. ఇక ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఇంకా క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ని ఎంటర్ చేసి Sent OTP పైన క్లిక్ చేసి చూడండి.ఇక మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి.తరువాత చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ రిక్వెస్ట్ స్టేటస్ అనేది మీకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: