తారక్ కొత్త కారు గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్‌కి రేసింగ్ బైక్స్, లగ్జరీ కార్లంటే చాలా అంటే చాలా ఇష్టం. అందుకే ఈ మధ్య ఇటలీ లంబోర్ఘిని కార్ ని ఎన్టీఆర్ బుక్ చేశారు.నిన్న అనగా ఆగస్టు 16వ తేదీన "Lamborghini Urus Graphite Capsule" ఇండియాలో లాంచ్ అవ్వడం జరిగింది. ఇక ఇండియాలో దీని రేటు చూసినట్లయితే 3 కోట్లకు పైనే. అత్యాధునికమైన ఫీచర్లతో అత్యంత అద్భుతంగా డిజైన్ చేసిన ఈ సూపర్ కార్‌లో త్వరలోనే తారక్ హైదరాబాద్ రోడ్ల మీద రేసర్ లా షికారు చెయ్యబోతున్నాడు.ఇక ఈ సూపర్ కార్ లంబోర్ఘిని ఊరుస్ ఫీచర్ల విషయానికి వస్తే..ఇక లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ ముందు భాగంలో డిఆర్ఎల్ తో మంచి సొగసైన హెడ్‌ల్యాంప్‌ ని చూడవచ్చు.ఈ సూపర్ లంబోర్ఘిని కార్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లతో డిజైన్ చెయ్యబడింది.ఇక కింద వెంట్స్ కూడా మనం గమనించవచ్చు. ఇక ఈ ఎస్‌యూవీ కార్ కలర్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే లంబోర్ఘిని లోగో వచ్చేసి మాట్టే బ్లాక్ కలర్‌లో ఉంటుంది. దీనికి కింద ఆరెంజ్ కలర్ లిప్ ఉంది.


 ఇక ఇది గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్‌లోని చాలా ముఖ్యమైన ఎలిమెంట్లలో ఒకటని చెప్పాలి.ఇక ఈ గ్రాఫైట్ క్యాప్సూల్ 23 ఇంచెస్ మల్టీస్పోక్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది.అలాగే డోర్స్ కింద ఒక ఆరంజ్ కలర్ స్ట్రిప్ అనేది ఉంది. ఇది చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. ఈ లంబోర్ఘిని ఉరుస్ వెనుక వైపు ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ యూనిట్లను కలిగి ఉంది. అలాగే మధ్యలో లంబోర్ఘిని లోగో ఉంది. ఇక అదే విధంగా దీని పైన కుడివైపున ఉన్న స్పాయిలర్ ఆరెంజ్ కలర్ షేడ్‌లో ఫినిషింగ్ అనేది ఉంది.ఇక ఇది వెనుక భాగంలో క్వాడ్ ఎగ్జాస్ట్ అవుట్‌ లెట్‌లను కూడా పొందడం విశేషం.ఇక ఇందులో ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ కూడా ఉంది. ఈ ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్ ని ఓపెన్ చేయగానే మీకు 616 లీటర్ల సామర్థ్యంతో ఉన్న పెద్ద బూట్‌ స్పేస్ అనేది లభిస్తుంది. ఇక ఇది ఎక్కువ లగేజ్ ఉంచుకోవడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఇక అలాగే దాని వెనుక వైపు సన్‌షేడ్  కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: