వైరల్: ఏటీఎం కార్డు సైజ్ లో ఫోన్..?

Suma Kallamadi
రోజు రోజుకూ టెక్నాల‌జీ కొత్త పుంత‌లు తొక్కుతోంది. స్మార్ట్‌ఫోన్ల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. స్మార్ట్‌ఫోన్‌లు ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటాయ‌. ఇప్పుడు మ‌నం చ‌ద‌వ‌బోయేది కూడా అలాంటిదే...సాధారణంగా స్మార్ట్‌ఫోన్ సైజ్ ఎంత ఉంటుందంటే 5 అంగుళాల నుంచి 7 అంగుళాల వరకు ఉంటుంది. కానీ చైనాకు చెందిన మోనీ కంపెనీ మింట్ పేరుతో అతి చిన్న స్మార్ట్‌ఫోన్ ను విడుద‌ల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 3 అంగుళాలు డిస్‍ప్లే మాత్రమే ఉంటుంద‌ని ఆ కంపెనీ తెలిపింది. అంటే దాదాపు క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ సైజులో ఈ స్మార్ట్‌ఫోన్ ఉంటుంద‌న్న మాట‌. అయితే ఇదే ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్.


అయితే అంత‌కు ముందు పామ్ ఫోన్ ను విడుద‌ల చేశారు. ఆ ఫోన్ సైజ్ మాత్రం 3.3 అంగుళాలు.  కానీ మోనీ మింట స్మార్ట్‌ఫోన్ సైజ్ 3 అంగుళాలు మాత్రమే. ఈ చిన్న ఫోన్ ధర 150 డాలర్లు. అంటే రూపాయ‌ల్లోకి మారిస్తే సుమార రూ.11,131. అయితే కంపెనీ ఎర్లీ బర్డ్ ఆఫ‌ర్‌ను తీసుకొచ్చింది. ఆ ఆఫ‌ర్‌లో తీసుకుంటే కేవలం 100 డాలర్లకే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. అంటే ధర రూ.7,500 లోపే ఉంటుంద‌న్న మాట‌. దీనిని ఇండీగోగో క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవ‌చ్చు. 100 డాలర్ల ఎర్లీ బర్డ్ స్లాట్స్ పూర్తైతే, 115 డాలర్లు, 130 డాలర్ల ఎర్లీ బర్డ్ స్లాట్స్ వంటి ఆఫ‌ర్లు కూడా ఉన్నాయి. కానీ ఇక్క‌డ విచిత్రమేమిటంటే ఈ ఫోన్‌ను ఇప్పుడు ఆర్డర్ చేస్తే నవంబర్‌లో వ‌స్తుంది.


ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అయిన మోనీ మింట్ స్పెసిఫికేషన్స్ చూస్తే షాక్ అవుతారు. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్. డ్యూయెల్ సిమ్ ఆప్ష‌న్ ఇందులో ఉంది. 3 అంగుళాల డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ క‌లిగి ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 128జీబీ వరకు స్టోరేజ్ ను పెంచ‌కునే ఆప్ష‌న్ ఇచ్చారు. గూగుల్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ మొబైల్ పనిచేస్తుంది. ఇందులో 1,250ఎంఏహెచ్ పాలీమర్ బ్యాటరీని క‌లిగి ఉంది. టైప్ సీ పోర్ట్ చార్జ‌ర్ ను ఇచ్చారు. అయ‌తే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 72 గంటల వరకు నిరంత‌రంగా వాడుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా, 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ను ఇచ్చారు. అయితే ఇందులో రెండు ర‌కాల క‌ల‌ర్ల‌ను విడుద‌ల చేశారు. ఒక‌టి బ్లూ, మ‌రొక‌టి బ్లాక్ కలర్స్‌లో కొనుక్కోవ‌చ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు కూడా చాలా తక్కువ‌. స్పోర్ట్స్, జాగింగ్ లాంటి ఔట్ డోర్ కు వెళ్లిన‌ప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ను తీసుకెళ్లొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: