ఆకట్టుకుంటున్న వన్ ప్లస్ నార్డ్ 2

ఇక వన్ ప్లస్ కంపెనీ నుంచి ఎంతో కాలంగా ఎదురచూస్తున్న నార్డ్ మోడల్ రానే వచ్చింది. ప్రముఖ మొబైల్ దిగ్గజ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ తన సరికొత్త మోడల్ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. నార్డ్ 2 5జీ స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ అనే అప్ డేటెడ్ ప్రాసెసర్ ను తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిన విషయం. గత సంవత్సరం జూలై నెలలో విడుదల చేసిన వన్‌ప్లస్‌ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు పోటీగా మార్కెట్లో దీనిని తీసుకురావడం జరిగింది. ఇక ఈ సరికొత్త వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్‌ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.27,999 ఉండగా,  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.29,999 వుంది.ఇక అలాగే 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వచ్చేసి రూ.34,999గా ఉంది. ఇక ఈ 5 జి స్మార్ట్ ఫోన్ బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. ఇక వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ  స్మార్ట్ ఫోన్ జూలై 28 వ తేదీన అమెజాన్, OnePlus.in, వన్‌ప్లస్‌ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రాబోతుంది.

ఇక వన్‌ప్లస్‌ నార్డ్ 2 ఫీచర్స్ విషయానికి వస్తే...ఇది 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే కలిగి వుంది.ఇక అంతేగాక ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3 కలిగి ఉండటం విశేషం. అలాగే ఈ ఫోన్ ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్ తో పని చేస్తుంది.దీనికి 5జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కలదు.6 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్)తో ఇది పని చేస్తుంది.అలాగే దీనికి 7 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్) వుంది.ఇక ఈ ఫోన్ కి 8 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్)ఇంకా 9-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్) ఉండటం విశేషం.ఇక అలాగే 10జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అలాగే 11జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2 ఇంకా యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ కలిగి వుంది.అలాగే ఇందులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ వున్నాయి.ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని సొంతం.4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ ఇంకా 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ అలాగే 189 గ్రాముల బరువు వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: