స్కూల్ కి వెళ్ళే పిల్లలు మారాం చేయటం ఎంత సహజమే, వారిని బ్రతిమిలాడో, కోప్పడో, తల్లిదండ్రులు వారిని స్కూలుకు పంపడం సహజం. కరోనా కారణంగా ప్రస్తుతం ఎక్కువగా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అయితే ఈ క్లాసులకు హాజరు అవుతున్న పిల్లలు నిజంగా ఆసక్తితో ఉన్నారా. లేదా బలవంతంగా హాజరవుతున్నారా..? తెలుసుకునే టెక్నికల్ ప్లాట్ఫా మును సైంటిస్ట్ లు అభివృద్ధి చేశారు. అయితే ఇది ఇంకా మా దగ్గరికి అందుబాటులోకి రాలేదు. క్లాస్ వరకు పిల్లలు ఏ విధంగా స్పందిస్తున్నారు. ఆన్లైన్లో క్లాసు ఎందుకు ఇంత ఆసక్తి చూపుతున్నారు అనే విషయాలను తెలుసుకునేందుకు హాంగ్ కాంగ్ టీచర్లు కృత్రిమ మేధస్సును ఆశ్రయించారు. ఫోర్ లిటిల్ ట్రీస్ గా పిలిచే ఈ యొక్క సాఫ్ట్ వేర్ ను హాంకాంగ్ కు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ ఫైండ్ సొల్యూషన్ రూపొందించినది.
దీనితో పిల్లల యొక్క ముఖంలోని భావోద్వేగాల్ని, కుత్రిమ మేధా గుర్తించి విశ్లేషణ చేస్తుంది. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు స్టూడెంట్ తీసుకునే సమయం, వారి మార్పులు వారి బలాలు, బలహీనతలను ఈ కృత్రిమ మేధస్సు పరీక్షిస్తుంది. కేవలం పిల్లలను అధ్యయనం చేయడమే కాకుండా వారి అలవాట్లను మెరుగుపరిచేందుకు అవసరమైన చిట్కాలను కూడా చెబుతుంది. ఫోర్ లిటిల్ ట్రీస్ ను వాడిన తర్వాత పలువురు పిల్లలో మార్పులు కనిపించాయని టీచర్లు చెబుతున్నారు. అలాగని టెక్నాలజీపై పిల్లలంతా సంతోషంగా ఉన్నారా. అంటే లేదనే సమాధానం చెబుతున్నారు. సాంకేతికత ఎక్కువగా వాడితే పిల్లల స్వేచ్ఛకు భంగం కలిగే ప్రమాదం ఉందని పలువురు తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రైమరీ డేట పై సైతం ఆందోళన చెందుతున్నారు.
కానీ సాఫ్ట్ వేర్ కేవలం విశ్లేషణను, ఒక కండరాల కదలికలను అధ్యయనం చేస్తుంది గాని ఎలాంటి వీడియోలు తీయడానికి కంపెనీ తెలిపింది. అయితే సాఫ్ట్ వేర్ ఉత్పత్తిలో పిల్లల ముఖ కదలికలు వాడుకోవడంతో ఈ సమస్య వచ్చిందని, అప్డేట్ చేసే సమయంలో దీన్ని సరి చేయవచ్చని కంపెనీ భరోసా ఇస్తున్నది. మొత్తం మీద పిల్లల ముఖం చూసి మూడును చెప్పే సాఫ్ట్ వేర్ త్వరలో అన్ని దేశాలకు రాబోతుందని ఆయన అన్నారు.