వాట్సాప్‌: త్వరలోనే విడుదల కానున్న అదిరిపోయే ఫీచర్లు ఇవే..!

Suma Kallamadi
వాట్సాప్ లో ప్రతి నెలా ఏదో ఒక కొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తూనే ఉంది. యూజర్లకు మంచి ఎక్స్పీరియన్స్ అందించేందుకు వాట్సాప్ సంస్థ నిరంతరాయంగా కృషి చేస్తూనే ఉంది. ఇందులోని భాగంగానే తాజాగా వాట్సాప్ తమ యూజర్ల కోసం 3 సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు బాగా ఉపయోగపడే 3 ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


ఆ 3 ఫీచర్స్ ఫీచర్స్ ఏంటో తెలుసుకుంటే.. మొదటిది వాట్సాప్ "వాయిస్ వేవ్‌ఫామ్స్".. రెండవది "వ్యూ వన్స్ ఫీచర్".. మూడవది "రిడిజైన్డ్ ఇన్-యాప్ నోటిఫికేషన్స్". అయితే ఈ 3 ఫీచర్స్ లో ఒక్కొక్క ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.


1. వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫామ్స్:


వాయిస్ వేవ్‌ఫామ్స్ మీరు చాలా ఆడియో అప్లికేషన్లలో చూసే ఉంటారు. ఉదాహరణకి ఒక పాట ప్లే చేస్తుంటే మనకి స్క్రీన్ పై కొన్ని వేవ్స్ డిస్ ప్లై అవుతుంటాయి. సైలెంట్ సమయంలో వేవ్స్ చిన్నగా.. అదే సౌండ్ పెరుగుతుంటే అవి పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వాట్సాప్ లో సెండ్ చేసిన వాయిస్ మెసేజ్ లు ప్లే చేస్తే సింపుల్ గా టైమ్ డ్యూరేషన్ బార్ కనిపిస్తుంది. కానీ ఇకపై వేవ్స్ కనిపించనున్నాయి. వాట్సాప్ బీటా ప్రోగ్రాం ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్లు మాత్రం ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.


2. వ్యూ వన్స్ ఫీచర్:


వాస్తవానికి "వ్యూ వన్స్" ఫీచర్ చాలా మెసేజింగ్ అప్లికేషన్ లలో అందుబాటులో ఉంది. కాగా ఎట్టకేలకు వాట్సాప్ సంస్థ ఈ ఫీచర్ ని వినియోగదారుల కోసం తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఫీచర్ వినియోగించి మెస్సేజ్, ఫొటోలు, వీడియోలు, టెక్ట్స్ మెస్సేజ్ ఇలా రకరకాల మెసేజెస్ పంపిస్తే అవతలి యూజర్లు మీరు పంపిన మెసేజెస్ ఒక్కసారి చూడగానే డిలీట్ అయిపోతుంది. అవతలి వ్యక్తి మరొకసారి చాట్ ఓపెన్ చేసి చూసినప్పుడు మనం వ్యూ వన్స్ ఫీచర్ వినియోగించి సెండ్ చేసిన మెసేజెస్ కనిపించకుండా మాయమవుతాయి. ప్రస్తుతం వాట్సాప్ లో మనం సెండ్ చేసిన మెసేజెస్ అవతలి వ్యక్తి ఎన్నిసార్లైనా చూడగలుగుతారు. ఒకవేళ మనం సెండ్ చేసి వెంటనే డిలీట్ చేస్తే అతని చాట్ నుంచి మెసేజెస్ మాయమైపోతాయి. కానీ డిలీట్ చేయకపోతే మనం పంపించిన ప్రతి మెసేజ్ అతని చాట్ లో అలానే ఉండిపోతుంది.


3. రిడిజైన్డ్ ఇన్-యాప్ నోటిఫికేషన్స్:


ఇక నోటిఫికేషన్ విషయంలో వాట్సాప్ రిడిజైన్డ్ ఇన్-యాప్ నోటిఫికేషన్స్ ఫీచర్ ని అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ ఉపయోగించి యాప్ నోటిఫికేషన్‌ను పెద్దదిగా చేసుకుని ఛాట్ ప్రివ్యూ కూడా రీడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చదివేసిన పాత మెసేజ్ లు కూడా నోటిఫికేషన్‌లోనే నేరుగా స్క్రోల్ చేసి రీడ్ చెయ్యొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: