బుల్లిపిట్ట: కేవలం రూ. 13,499 లకే అమెజాన్ లో టీవీ..

Divya

ప్రస్తుతం ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్/ఒక  టీవీ ఉంటుంది. ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ ప్రకారం డిస్కౌంట్ పేర్లతో, ఆయా సంస్థలు కస్టమర్లకు గాలం వేస్తూనే ఉన్నాయి. ఇక ఈ మధ్యనే ఇతర దేశాల నుండి భారతదేశంకు సరికొత్త టీవీలను పరిచయం చేశాయి ఆయా సంస్థలు. అయితే ఇప్పుడు మరొక సరికొత్త టీవీ మన ముందుకు వచ్చింది. ఆ టీవీ యొక్క విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

ఎఫ్ ఫాల్కన్ అనే సంస్థ మన దేశంలో ఒక సరికొత్త టీవీ ని లాంచ్ చేసింది. ఆ టీవీ ని  F2A పేరుతో విడుదల చేసింది. వీటిని కొనుగోలు చేయాలనుకునేవారు అమెజాన్ లోనే రూ.13,499 నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ టీవీలో గూగుల్ యాప్ , ప్లే స్టోర్ తో పాటు, ఫుల్ హెచ్డీ ప్యానల్ తో ఈ టీవీని అందించనుంది. ఇక అంతే కాకుండా HDR పిక్చర్ కూడా కలదు.

ఇందులో ఉండేటువంటి మైక్రో డిమ్మింగ్, డైనమిక్ కాంట్రాక్ట్  ఫీచర్స్ ఉండడం వలన టీవీలో  ప్రసారమయ్యే ఎటువంటి ఛానల్స్ అయినా ఒక  ప్రత్యేకమైన జోనల్ గా విభజించి, ఆటోమెటిక్ గా BRITENESS, DARKNESS లను అందిస్తుంది. ఇదే టీవీకి హైలెట్ గా నిలిచింది. ఇలా ఉండటం చేత మన కళ్ళకి ఎలాంటి  ఇబ్బంది ఉండదని చెప్పవచ్చు.

ఇందులో గూగుల్ వాయిస్ సెర్చింగ్, నావిగేషన్ వంటివి అన్ని  సులువుగా చూసుకునే సదుపాయం కలదు. ఈ స్మార్ట్ టీవీలో కలిగి ఉన్న  HDR కేబుల్స్ ద్వారా అన్ని కేబుల్ లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక ఇందులో డాల్బీ ఆడియో సౌండ్ తో వినిపిస్తుంది. BUILD  స్టీరియో స్పీకర్ ద్వారా, టీవీలో ప్రసారమయ్యే పిక్చర్ ద్వారా సౌండ్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది.

ఇక అంతే కాకుండా ఈ టీవీ లో స్పోర్ట్స్ చూసేవారు సౌండ్, క్వాలిటీ ఇమేజ్  కూడా పెరుగుతాయి. అయితే ఇన్ని కొత్త ఫీచర్లు కలిగిన ఈ టీవీ లో ఇవన్నీ లభించడం ప్రత్యేకం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: